Reading Time: 2 mins

K Ramp Movie Review

👍 Thumbs Up Emoji: Meaning & Usage

 

స్టోరీ లైన్ :

కుమార్ (కిరణ్ అబ్బవరం) పెద్ద బిజినెస్ మెన్ (సాయికుమార్) కొడుకు. కుమార్ తాగి గొడవలు చేస్తూ తండ్రిని ఇబ్బంది పెడుతుంటే.. కుమార్ ని చదువు కోసం అని కేరళ  కాలేజీ కి పంపిస్తాడు. అక్కడ తలకాయ మందు తాగి ఇబ్బంది పడుతుంటే మెర్సీ ( యుక్తి తరేజా) హెల్ప్ చేసి కాపాడుతుంది. కుమార్ మెర్సీ తో లవ్ లో పడతాడు. కాని అక్కడున్న వారందరూ కుమార్ కి మెర్సీ తో లవ్ గురించి వార్నింగ్ ఇస్తుంటారు. అయినా కుమార్ వినడు. అసలు మెర్సీ తో లవ్ లో ప్రాబ్లం ఏంటి? కుమార్ మెర్సీ తో ఏం ప్రొబ్లెంస్ ఎదుర్కొన్నాడు?, కుమార్ తన తండ్రిని ఇబ్బంది పెట్టిన విషయం ఎలా రియలైజ్ అయ్యాడా? అనేది తెలియాలంటే సినిమా చూడాలి.

ఎనాలసిస్ : ఈ సినిమాలో ఏదో కొత్తదనం కోసం కేరళ బ్యాక్ డ్రాప్ పెట్టినట్టుగా వుంటుంది.. అంతే కానీ దానికొక ప్రత్యేకత ఏమీ వుండదు.. కిరణ్ అబ్బవరం అర్జెంట్ గా మాస్ హీరోగా ఎష్టాబ్లిష్ అవ్వాలనే తాపత్రయం కనిపిస్తుంది ప్రతి సీన్లో తన నటన, హావభావాలు మరియు తనని తాను మలచుకొనే ప్రయత్నం .. అది తప్పేమీ కాదు కానీ దానికి తగ్గ కంటెంట్, ఎమోషనల్ మూమెంట్స్ దాంతోపాటు సన్నివేశాల కూర్పు చాలా ప్రధానం.. హీరోగా కిరణ్ అబ్బవరం హార్డ్ వర్క్ ని అప్రిషియేట్ చేయకుండా వుండలేం..  స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో కొంచెం తనదైన శైలిని అలవర్చుకుంటే తొందరలోనే కిరణ్ ని కమర్షియల్ మాస్ హీరోగా చూడొచ్చు..

ఆర్టిస్ట్ ఫెరఫార్మెన్స్ :

క్వార్టర్ కుమార్ క్యారెక్టర్ లో కిరణ్ అబ్బవరం బాగా నటించాడు. హీరోయిన్ కి ఉన్న ప్రాబ్లం వలన కుమార్ ఇబ్బంది పడే సన్నివేశాలూ లో కామెడీ బాగా చేసాడు. యుక్తి తరేజా పిటిఎస్డి ప్రాబ్లం ఉన్న క్యారెక్టర్ లో చాలా బాగా నటించింది. వెన్నెల కిషోర్, నరేష్ క్యారెక్టర్ లు కామెడీ బాగా పండించారు. తండ్రి క్యారెక్టర్ లో సాయి కుమార్ పర్వాలేదు.

టెక్నికల్ గా :

‘కే ర్యాంప్’తో జైన్స్ నాని దర్శకుడిగా పరిచయం అయ్యాడు. స్టొరీ లైన్ రేగులేర్ గా ఉన్న కొన్ని కామెడీ సీన్స్ బాగా రాసుకొన్నారు. డైరెక్షన్ అయితే పర్వాలేదు.

చూడచ్చా :

చూడొచ్చు కానీ.. కొంచెం ఓపిక ఉండాలి..

ప్లస్ పాయింట్స్ :

నటీనటుల పెర్ఫార్మన్స్

మైనస్ పాయింట్స్ :

రెగ్యులర్ స్టొరీ.

తీర్పు :

K Ramp అంటే క్రింజ్ ర్యాంప్ అనుకుకుంటా..

నటీనటులు:

కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, సాయి కుమార్, నరేష్, మురళీధర్ గౌడ్, వెన్నెల కిషోర్ తదితరులు

సాంకేతికవర్గం :

సినిమా టైటిల్ : K-RAMP

బ్యానర్:

హాస్య మూవీస్

విడుదల తేదీ: 18-10-2025

సెన్సార్ రేటింగ్: “ U/A “

దర్శకత్వం: జైన్స్ నాని

సంగీతం: చైతన్ భరద్వాజ్

సినిమాటోగ్రఫీ: సతీష్ రెడ్డి మాసం

ఎడిటింగ్: చోటా కే ప్రసాద్

నిర్మాత: రాజేష్ దండ, శివ బొమ్మక్

రన్ టైం : 139 నిమిషాలు

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్