Kantara Chapter 1 Movie Pre Release Event Held
ఈవెంట్ లో హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. హ్యాపీ దసరా. మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. 2022 ఇదే రోజున కాంతార రిలీజ్ అయింది. ఆడియన్స్ చాలా పెద్ద హిట్ చేశారు. అక్టోబర్ 2న కాంతార: చాప్టర్ 1 వస్తోంది. ఈ సినిమాని కూడా అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్టు కావాలని కోరుకుంటున్నాను. మా సహోదరుడు జూనియర్ ఎన్టీఆర్ గారు, మన డార్లింగ్ ప్రభాస్ గారు గారికి థాంక్ యూ. సీఎం చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి థాంక్యూ సో మచ్. తెలుగు కన్నడ మేమందరం బ్రదర్స్. అక్టోబర్ 2 నా తప్పకుండా థియేటర్స్ లో కలుద్దాం. థాంక్యూ సో మచ్.
హీరోయిన్ రుక్మిణి వసంత్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం విజయవాడ వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. చాలా డివైన్ వైబ్ ఉంది. అందరికీ దసరా శుభాకాంక్షలు. తప్పకుండా మన సినిమా థియేటర్స్ లో చూడండి. సపోర్ట్ చేయండి. మీ అందరి ప్రేమ అభిమానులకు ధన్యవాదాలు.
హోంబలే ఫిల్మ్స్ కో ఫౌండర్ చలువే గౌడ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, వారి సపోర్ట్ కి ధన్యవాదాలు ధన్యవాదాలు. మా సినిమాకి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
ప్రగతి శెట్టి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. కాంతర సినిమాకి మీరిచ్చిన ప్రేమ అభిమానానికి ధన్యవాదాలు. ఈసారి కూడా మీ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు అందరిపై వుండాలి. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అక్టోబర్ 2న తప్పకుండా మీరందరూ సినిమా చూడాలని కోరుకుంటున్నాను.