కాంతార 2 కి సంగీతం అందించిన అజనీష్ లోకనాథ్ ఇప్పుడు షరీఫ్ మహమ్మద్ తో చేతులు కలిపారు. ఈ సినిమాకి సంగీతంతో అజనీష్ మరోసారి ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయనున్నారు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సంచలనంగా మారింది. వర్షంలో తడిచిన పేపే, చుట్టూ పడి ఉన్న మృతదేహాలు, ఏనుగు దంతాల మధ్య నిలబడి వుండటం కథలో ఉండబోయే వైలెన్స్ సూచిస్తోంది. మార్కో స్థాయిని మించి ఉండబోతోందని సంకేతాలు ఇస్తోంది.
జైలర్, లియో, జవాన్, కూలీ లాంటి చిత్రాలకు టైటిల్ ఫాంట్స్ డిజైన్ చేసిన ఐడెంట్ ల్యాబ్స్ ఈ సినిమాకి కూడా టైటిల్ డిజైన్ చేశారు.
కంటెంట్, మార్కెటింగ్ పరంగా క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుండగా, పేపే హై ఇంటెన్సిటీ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తరుణంలో కట్టలన్ నిజంగా ఒక గొప్ప సినీ అనుభూతి కావడంలో సందేహమే లేదు.
ఈ సినిమాకి పీఆర్ & మార్కెటింగ్ వంశీ శేఖర్.