Kingdom Movie Review
Emotional Engagement Emoji
స్టోరీ లైన్ :
1920లో బంగారు గని కోసం శ్రీకాకుళం సముద్ర ప్రాంతం పై దాడి చేసిన తెల్లవాళ్ళ నుంచి తన గూడెం పిల్లలను కాపాడి తెగ నాయకుడు మరణిస్తాడు. ఆ పిల్లలు శ్రీలంక చేరుకుని “దివి” అనే ప్రాంతంలో జీవనాన్ని కొనసాగిస్తుంటారు. హైదరాబాదులో మామూలు కానిస్టేబుల్ అయిన సూరి, చిన్నతనంలో తండ్రిని హత్య చేసి ఇంట్లో నుంచి పారిపోయిన తన అన్న శ్రీలంకలో ఉన్నాడని ఓ పోలీస్ అధికారి ద్వారా తెలుసుకుంటాడు. పోలీసులు అసైన్ చేసిన సీక్రెట్ ఆపరేషన్ పూర్తి చేస్తే మీ అన్నయ్యను ఇండియాకి తిరిగి తీసుకురావచ్చు అని అధికారి చెప్పగానే ఎలాగైనా తన అన్నయ్యను ఇంటికి తీసుకురావాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో అండర్ కవర్ కాప్ గా శ్రీలంక బయలుదేరతాడు సూరి.
అన్నయ్య శివను చేరుకోవటానికి సూరి ఏం చేశాడు? రోజూ ప్రమాదాలతో ప్రయాణం చేసే తన దగ్గరకు స్వంత తమ్ముడే వచ్చాడని తెలిసి శివ ఏం చేశాడు? పోలీసులు అసైన్ చేసిన ఆపరేషన్ సూరి పూర్తి చేశాడా? సూరి అసలు లక్ష్యం అన్నయ్యను కలవటం మాత్రమేనా?
ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే కింగ్డం చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే!
ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :
తెగ నాయకుడిగా, పోలీస్ కానిస్టేబుల్ గా, అన్నయ్య కోసం పరితపించే తమ్ముడిగా మూడు భిన్న పార్శ్వాలు గల “సూరి” పాత్రను విజయ్ దేవరకొండ చక్కగా పోషించారు. యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. సెంటిమెంట్ సీన్స్ లో నటనలో పరిణితి కనిపించింది. “శివ” పాత్రలో సత్యదేవ్ జీవించాడని చెప్పచ్చు. సినిమా కథ మొత్తం తన చుట్టూనే తిరుగుతుంది. భాగ్య శ్రీ బోర్సే పరిధి మేరకు నటించింది. తెలుగు తెరకు కొత్తగా పరిచయమైన మలయాళ నటుడు “వెంకిటేశ్” తన డైలాగులతో, హావభావాలతో ఆకట్టుకున్నాడు.
టెక్నికల్ గా :
కెమెరామెన్ గిరీష్ గంగాధరన్ మరియు జోమోన్ విజువల్స్ బాగున్నాయి. అనిరుధ్ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి వెన్నెముక అని చెప్పచ్చు. నవీన్ నూలీ ఎడిటింగ్ బావుంది & ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.
చూడచ్చా :
చూడొచ్చు
ప్లస్ పాయింట్స్ :
విజయ్ దేవరకొండ & సత్యదేవ్ పెర్ఫార్మెన్స్, అనిరుధ్ నేపథ్య సంగీతం, యాక్షన్ సీక్వెన్సెస్, విజువల్స్,
మైనస్ పాయింట్స్ : హీరో హీరోయిన్ల మధ్య తక్కువ సన్నివేశాలు ఉండటం, సగటు ప్రేక్షకుడు కోరుకునే పాటలు, కామెడీ లేకపోవటం
తీర్పు : హిట్
నటీనటులు: విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్య శ్రీ బోర్సే, వెంకిటేశ్, బాబురాజ్, రోహిణి తదితరులు
బ్యానర్: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ & శ్రీకర స్టూడియోస్
నిర్మాతలు: నాగ వంశీ & సౌజన్య
విడుదల తేదీ: 31-07-2025
సెన్సార్ రేటింగ్: “U/A“
సాంకేతికవర్గం :
రచన – దర్శకత్వం: గౌతం తిన్ననూరి
కెమెరా: గిరీష్ గంగాధరన్ మరియు జోమోన్
సంగీతం: అనిరుధ్
ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్ల
ఎడిటింగ్: నవీన్ నూలి
రన్ టైమ్ : 2 hr 35 mins
మూవీ రివ్యూ :
రావ్ శాన్ ఫిలిమ్స్ టీమ్