Madharaasi Movie Review
Emotional Engagement Emoji

స్టోరీలైన్ :
రఘు (శివకార్తికేయన్ ) చిన్నప్పుడే ఫైర్ ఆక్సిడెంట్ లో తన ఫ్యామిలీ ని కోల్పోయి డిల్యూషన్ సిండ్రోమ్ కి
గురవుతాడు. ఎవరైనా ఆపదలో ఉంటె తన వాళ్ళే గుర్తుకువచ్చి వాళ్లకి హెల్ప్ చేస్తుంటాడు. కొన్నేళ్లు ట్రీట్మెంట్
తర్వాత తన లైఫ్ లోకి మాలతీ (రుక్మిణి వసంత్) వస్తుంది.
ఇంకో పక్క చిరాగ్ (షబీర్), విరాట్ (విద్యుత్ జమ్వాల్) లు ఒక సిండికేట్ తో కలిసి తమిళనాడు లోకి గన్
కల్చర్ తీసుకురావాలని ప్లాన్ చేస్తారు. ఎన్ ఐ ఏ అధికారి ప్రేమ్ (బిజూ మీనన్) తన బృందంతో ఆ గన్ కల్చర్
ని ఆపాలని ట్రై చేస్తుంటాడు. ఈ మిషన్ లోకి రఘు ఎలా ఎంటర్ అయ్యాడు? తన లవర్ కోసం రఘు ఏమేం
చేసాడు? ఈ గన్ మాఫియా వెనుక ఉన్నది ఎవరు? ఆ గన్ లోడ్ బయటకి రాకుండా ఆపారా లేదా అనేది
తెలియాలి అంటే మనం ఈ సినిమా చూడాలి.
ఎనాలసిస్ :
తమిళనాడు లోకి గన్ కల్చర్ వస్తే ఎంత ప్రమాదమో చూపించినా చిత్రం..
ఆర్టిస్ట్ల ఫెరఫార్మెన్స్ :
అమరన్ లాంటి సినిమా తర్వాత శివ కార్తికేయన్ డిల్యూషన్ సిండ్రోమ్ క్యారెక్టర్ లో చేయడం గొప్ప విషయం.
రఘు క్యారెక్టర్ లో అద్భుతంగా నటించాడు. ఎమోషనల్ సీన్స్ లో , యాక్షన్ సీక్వెన్స్ లో చాలా బాగా
చేసాడు. రుక్మిణి వసంత్ హీరో లవర్ రోల్ లో బాగా నటించింది. మూవీ అంతా ఈమె చుట్టూ
తిరుగుతుంటుంది.
విలన్స్ గా డాన్సింగ్ రోజ్ ఫేమ్ షబీర్, విద్యుత్ స్టైలిష్ గా కనిపించారు. యాక్షన్ సీక్వెన్స్ లో చాలా బాగా
పెర్ఫర్మ్ చేశారు. బిజూ మీనన్, పి సీ 2 గా కనిపించిన నటుడు తదితర ప్రధాన తారాగణం బాగా నటించారు.
టెక్నికల్గా :
డైరెక్టర్ మురుగుదాస్ గన్ కల్చర్ కాన్సెప్ట్ తీసుకొని హీరోకి ఒక
లోపాన్ని పెట్టి లవ్, యాక్షన్ మిక్స్ చేసాడు. స్టోరీ రెగ్యూలర్ గా
ఉన్న మురుగుదాస్ డైరెక్షన్ బాగుంది.
అనిరుద్ సంగీతం బాగుంది. సెకాండఫ్ లో కొన్ని సీన్స్ కి మంచి స్కోర్
ఇచ్చాడు. సుదీప్ ఎలమన్ ఇచ్చిన కెమెరా వర్క్ బాగుంది. కెవిన్ కుమార్
యాక్షన్ పార్ట్ మాత్రం చాలా బాగుంది. ఈ సినిమాలో నిర్మాణ విలువలు
బాగున్నాయి. మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా కోసం ఖర్చు
పెట్టారు.
చూడచ్చా :
చూడొచ్చు
ప్లస్పాయింట్స్ :
నటీనటుల పెర్ఫార్మన్స్ , యాక్షన్ సీన్స్
మైనస్పాయింట్స్ :
రెగ్యూలర్ స్టోరీ, కొన్ని ఫోర్స్డ్ సీన్స్
తీర్పు :
మదరాసి అనే టైటిల్ ఎందుకు పెట్టారో మురుగుదాస్ కే తెలియాలి..
నటీనటులు:
శివ కార్తికేయన్, రుక్మిణి వసంత్, విద్యుత్ జమ్వాల్, షబీర్, బిజూ మీనన్ తదితరులు
సాంకేతికవర్గం :
సినిమాటైటిల్ : మదరాసి
బ్యానర్: శ్రీ లక్ష్మీ మూవీస్
విడుదలతేదీ: 05-09-2025
సెన్సార్రేటింగ్: “ U/A “
దర్శకత్వం: ఎ ఆర్ మురుగదాస్
సంగీతం: అనిరుద్ రవిచందర్
సినిమాటోగ్రఫీ: సుదీప్ ఎలమన్
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
నిర్మాత: N. శ్రీలక్ష్మి ప్రసాద్
రన్టైమ్: 167 నిమిషాలు





