Reading Time: 2 mins

Mirai Movie Review

Emotional Engagement Emoji

 

స్టోరీ లైన్ :
కళింగ యుద్ధం తర్వాత అశోకుడు పశ్చాత్తాపానికి లోనై తనలోని శక్తిని
తొమ్మిది గ్రంథాలులోకి పంపించి తొమ్మిది మంది రక్షకులకి అందిస్తాడు.
కొన్ని వందల ఏళ్ళ తర్వాత ఈ గ్రంథాలుని చేజిక్కించుకొని దైవశక్తి ని
పొందాలని మహావీర్ (మంచు మనోజ్) ప్రయత్నిస్తాడు. తొమ్మిదో గ్రంథం
అంబిక (శ్రియా శరన్) రక్షలో ఉంటుంది. మరి దానికి తన కొడుకు వేద (తేజ
సజ్జ) ఎలా రాముని కోదండం అయిన మిరాయ్ ని చేజిక్కించుకొని రక్షకుడిగా
మారాడు. తాను వేద నుంచి యోధ గా ఎలా పరిణామం చెందాడు? ఈ క్రమంలో తాను
ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? చివరికి ఆ తొమ్మిదో గ్రంథం మహావీర్ కి
దక్కకుండా చేశాడా లేదా? మహావీర్ గతం ఏంటి? అసలు ఆ మిరాయ్ ఏంటి?
అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి.
ఎనాలసిస్ :
రాముడి కోదండం అయినా మిరాయ్ ప్రపంచాన్ని కాపాడటం.
ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :
వేద క్యారెక్టర్ లో తేజ బాగా నటించాడు. తల్లి అంబిక క్యారెక్టర్
లో శ్రియ పెర్ఫార్మన్స్ బాగుంది. సన్యాసి గా రితిక సింగ్ చాలా బాగా
చేసింది. సినిమాకి మంచు మనోజ్ యాక్టింగ్ అద్బుతంగా ఉంది. జపాన్ లో
స్వోర్డ్ ఫైట్ , మొరాకో లో శబ్ద గ్రంధం ఫైట్ లో పెర్ఫార్మన్స్
చాలా బాగుంది. జయరాం, జగపతిబాబు వాళ్ళ పరిధి లో బాగా నటించారు.
టెక్నికల్ గా :
దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మైథాలజీ, హిస్టారికల్ ఎలెమెంట్స్ తో
మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అందించాడు. సంగీత దర్శకుడు గౌర హరి
ఈ సినిమాకి కూడా మంచి మ్యూజిక్ అందించాడు. దర్శకుడు కార్తీక్
ఘట్టమనేనే కెమెరా వర్క్ కూడా అందించారు. విజువల్ గా చాలా బాగుంది.
ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. ఈ సినిమా నిర్మాణ విలువలు మాత్రం
ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయని చెప్పవచ్చు..

చూడచ్చా :

చూడొచ్చు
ప్లస్ పాయింట్స్ :
స్టొరీ లైన్, నటీనటుల పెర్ఫార్మన్స్, యాక్షన్ సీన్స్.
మైనస్ పాయింట్స్ :
సెకండ్ హాఫ్ లో కొన్ని లాగ్ సీన్స్
తీర్పు :
ఇంప్రెస్స్ చేసే  మైథలాజి మూవీ ‘మిరాయ్’
నటీనటులు:
తేజ సజ్జ, మంచు మనోజ్, రితిక నాయక్, శ్రియా శరన్, జగపతి బాబు, జయరాం ,
గెటప్ శ్రీను.

సాంకేతికవర్గం :
సినిమా టైటిల్ : ‘మిరాయ్’- SUPER YODHA
బ్యానర్: People Media Factory
విడుదల తేదీ: 12-09-2025
సెన్సార్ రేటింగ్: “ U/A “
దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని
సంగీతం: గౌర హరి
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని

ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
నిర్మాత:  టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
రన్టైమ్: 169 నిమిషాలు