భాస్కర భట్ల కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్
 
అతడి పాటకు పాతికేండ్లు 
అతడోనదీ ప్రవాహం లాంటి వాడు
గోదావరి పరివాహక ప్రాంతంలో పుట్టిన 
కెరటమతడు ..
అతడో పాటల స్వాప్నికుడు
అతడో పాటల మాంత్రికుడు 
అతడో గోదావరి పిల్ల తెమ్మెర
అతని గురించి ఎంత చెప్పినా తక్కువే.. 
గోదావరి ఇసుకలో చెలిమె నుండి 
స్వచ్ఛమైన నీరు తోడి నట్టు 
పాటలకు పదాలను తోడు చేస్తాడు. 
చిన్న తనం నుండి సాహిత్యాన్ని చదువు కోవడం వల్ల 
అతని నర నరాన అక్షరాలు అల్లుకు పోయాయి. 
సీతారామ శాస్త్రిని తేటగీతిగా తీసుకుని  
వేటూరిని ఆట వెలది గా కూర్చుకున్నాడు. 
అతను పదాలు కూరిస్తే పాట దానికై అదే నాట్యమాడుతుంది. 
రాజమండ్రిలో పుట్టిన ఈ పాటగాడు .. కల కన్నాడు .. కలను సాకారం చేసుకోవాలనుకున్నాడు.. దానికోసం ప్రయత్నించాడు .. సాధించాడు.. 
పాతికేళ్ళుగా అతని చెట్టుకు పాటల పూలు పూస్తూనే ఉన్నాయి. 
పుప్పొడి లా అతని పాటలు పరిమళిస్తూనే ఉన్నాయి. 
ఏ పూట కాపూట పరగడుపే అన్నట్టు 
ఏ పాట కాపాట కొత్తగా రాస్తాడు. 
అతను పాట కోసం ప్రాకులాడుతాడు 
 ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్‌ సభ్యుడైన భాస్కర భట్ల సినిమా రచయితగా పాతికేండ్ల ప్రయాణించిన  సందర్భంగా ...ఈ రోజు ఆయన పుట్టిన రోజును పునస్కరించుకుని 
 ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బత్తుల ప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి సురేష్‌ కొండేటి. ఉప కార్యదర్శి ఆర్‌ శ్యాంకుమార్‌, కుమార స్వామి, జిల్లా సురేష్‌ లు భాస్కరభట్ల రవికుమార్‌ ఇంటికి వెళ్ళి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.