చకోర- లూనార్ లవ్ బర్డ్ మూవీ సాంగ్ విడుదల
"చకోర- లూనార్ లవ్ బర్డ్" మూవీ 'అద్దంలా చేయనా..' సాంగ్ రిలీజ్
శ్రవణ్, మలైకా టి వాసుపల్ జంటగా నటిస్తున్న సినిమా "చకోర- లూనార్ లవ్ బర్డ్". ఈ చిత్రాన్ని వీఐపీ వింటేజ్ ఐకానిక్ పిక్చర్స్ సారథ్యంలో హై జాయ్ కమర్షియల్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ డా.చింతాడ హేమారావు నిర్మిస్తున్నారు. "చకోర- లూనార్ లవ్ బర్డ్" సినిమాతో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దగ్గర ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన మంగా శ్రీనివాస్ నూతన దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అక్టోబర్ 8న ఈ సినిమా గ్రాండ్ థియేటర్ రిలీజ్ కి రాబోతోంది.
"చకోర- లూనార్ లవ్ బర్డ్" సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ సినిమాలోని 'అద్దంలా చేయనా..' సాంగ్ ను అనకాపల్లి ఎంపీ సి.ఎం. రమేష్ రిలీజ్ చేసి సినిమా టీమ్ కు బెస్ట్ విశెస్ అందించారు. ప్రిన్స్ హెన్రీ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేసిన ట్యూన్ కు కాసర్ల శ్యామ్ క్యాచీ రిలిక్స్ అందించారు. సాయి చరణ్ భాస్కరుణి అందంగా పాడారు. 'అద్దంలా చేయనా..' సాంగ్ ఎలా ఉందో చూస్తే - అద్దంలా చేయనా చిట్టి గుండెని, అందంగా దాచేయంగ జాబిలమ్మని, అరచేత నింపనా చిన్ని ప్రేమని, గీతంగా మార్చేయంగ వెన్నెలమ్మని, నిలువెల్ల ఊసులన్నీ మోస్తుంటే, ఆకాశమంత ఉండి నేనే, ఆ పొద్దు మాపు గడిపేనా..' అంటూ ప్రేమికుడి గుండెల్లోని భావాలను అందంగా వెల్లడిస్తూ ఆకట్టుకుంటోందీ పాట.
నటీనటులు - శ్రవణ్, మలైకా టి వాసుపల్, అనుష్క లూహార్, యామిని, ఎల్ బి శ్రీరామ్, సుమన్, బ్రహ్మాజీ, ఇంద్రజ, మణి చందన, నెల్లూరు సుదర్శన్, ప్రభావతి, మాధవి ప్రసాద్, జనార్దన్, ఆకెళ్ళ గోపాల కృష్ణ, వంగపండు,వంశీ, సుమంత్, భాను, సూర్య మాకిరెడ్డి, తదితరులు
టెక్నీషియన్స్
పీఆర్ఓ - సురేష్ (ఎస్ కే మీడియా)
డీవోపీ - రుప్ప గోపీకృష్ణ
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
మ్యూజిక్ డైరెక్టర్ - ప్రిన్స్ హెన్రీ
నిర్మాత - డా. చింతాడ హేమారావు
రచన, దర్శకత్వం - మంగా శ్రీనివాస్