దాదా చిత్రం బాలకృష్ణ పోస్టర్ విడుదల
నందమూరి బాలకృష్ణ 'దాదా’ సినిమా స్పెషల్ పోస్టర్ రిలీజ్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన మోస్ట్ అవేటెడ్ మాస్ ఎంటర్టైనర్ ‘దాదా’తో ఈ పండగ సీజన్లో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో ‘వీరసింహారెడ్డి’ వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ కావడంతో ఈ హై వోల్టేజ్ కమర్షియల్ ఎంటర్టైనర్పై అంచనాలు మరింత పెరిగాయి.
దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఓ ప్రత్యేక ప్రకటనతో పాటు కలర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో బాలకృష్ణతో పాటు బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ అలరించారు. ఈ పోస్టర్ ద్వారానే సినిమా ఫస్ట్ సింగిల్ టైటిల్‌ను ‘దాదా ధమాకా’గా ప్రకటించారు. ఈ పాటను నవంబర్ 13న విడుదల చేయనున్నారు.
లెదర్ జాకెట్, సన్‌గ్లాసెస్‌తో స్టైలిష్, ఫ్లాంబాయంట్ అవతార్‌లో బాలకృష్ణ కనిపిస్తుండగా, అద్భుతమైన అవుట్‌ఫిట్‌లో నర్గీస్ ఫక్రీ గ్లామరస్‌గా మెరిశారు. గ్రాండ్‌గా వెలుగులతో నిండిన బ్యాక్‌డ్రాప్‌లో వీరిద్దరి ఎనర్జిటిక్ పోజులు పండగ వాతావరణాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాయి. దీపావళితోనే వేడుకలు ముగిసిపోవని ‘దాదా ధమాకా’ రూపంలో మరో మ్యూజికల్ ట్రీట్ అందించబోతున్నామని చిత్రబృందం ప్రకటించింది. ఎస్. తమన్ స్వరపరిచిన ఈ ఫస్ట్ సింగిల్ అదిరిపోయే మ్యూజికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుంది.
ఈ చిత్రంలో మంచు మనోజ్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టాప్ టెక్నికల్ టీం సినిమాకు పనిచేస్తోంది. అరవింద్ ఎస్. కశ్యప్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్ నిర్వహిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాశారు. రామ్-లక్ష్మణ్, రవివర్మ, వి. వెంకట్ యాక్షన్ సీక్వెన్స్‌లను కంపోజ్ చేస్తున్నారు.
ఫస్ట్ సింగిల్‌తో పండగ సందడిని కొనసాగించనున్న ‘దాదా’ చిత్రం డిసెంబర్ 24న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. నవంబర్ 13న విడుదల కానున్న ‘దాదా ధమాకా’తో సినిమా ప్రమోషన్స్ మరో ఆసక్తికరమైన దశలోకి అడుగుపెట్టనున్నాయి.
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, మంచు మనోజ్, కాజల్ అగర్వాల్, నర్గీస్ ఫక్రీ
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
బ్యానర్: వృద్ధి సినిమాస్
సంగీతం: ఎస్. తమన్
సినిమాటోగ్రఫీ: అరవింద్ ఎస్. కశ్యప్ ISC
ఎడిటర్: నవీన్ నూలి
సంభాషణలు: సాయి మాధవ్ బుర్రా
ఫైట్స్: రామ్-లక్ష్మణ్, రవివర్మ, వి. వెంకట్
పీఆర్వో: వంశీ-శేఖర్