షూటింగ్ పూర్తి చేసుకున్న ధనరాజ్ కొత్త సినిమా 

పిఎన్ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది, సత్యనారాయణ నాగుల నిర్మాతగా  స్కంద దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ధనరాజ్,  హ్యాపీడేస్ ఫేమ్ వంశీ చాగంటి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో నిర్మితమవుతున్న ఈ సినిమాలో సాకీ రాయ్ హీరోయిన్,  అప్పాజీ,  దయానంద్ రెడ్డి,  ప్రశాంత్,  పద్మారావ్,  కేశవి తదితరులు నటిస్తున్నారు.

జి కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహారిస్తున్న ఈ సినిమాకు రాహుల్ శ్రీవాస్తవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు అలాగే సాయి కార్తీక్ సంగీతం, హరి ఎడిటర్ గా చేస్తున్నారు.

దర్శకుడు స్కంద అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ సినిమాను తీస్తున్నారు, నిర్మాత సత్యనారాయణ నాగుల ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మాకంగా నిర్మిస్తున్నారు, త్వరలో ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ విడుదల కానున్నాయి.