ధర్మస్థల నియోజకవర్గం చిత్రం  పాట విడుదల 

"ధర్మస్థల నియోజకవర్గం" చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః’ పాట విడుదల 

‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః ’ పాటను ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి , ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్ర బోస్ సంయుక్తంగా నేడు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు చిత్ర బృందానికి   శుభాకాంక్షలు తెలియజేశారు.

సినిమా కథాంశానికి అనుగుణంగా రూపొందించిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని చిత్ర బృందం తెలిపింది
ధర్మో రక్షతి రక్షితః. పాట విడుదల కార్యక్రమంలో  చిత్ర దర్శకులు జై జ్ఞాన ప్రభ తోట, చిత్ర నిర్మాత  మెరుం భాస్కర్ సంగీత దర్శకుడు  యేలెంధర్ , సినిమాటో గ్రాఫర్  వెంకట్ హనుమ, లతో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొని, సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట మాట్లాడుతూ
ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి చేతుల మీదుగా మా  సినిమా పాట విడుదల కావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే మా ప్రతి అడుగులోనూ చంద్రబోస్ గారు వెన్నంటి ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు ఆయనకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రo త్వరలో  ముందుకు రానుందని,ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందనే  ఆశాభావం వ్యక్తం చేశారు జై జ్ఞాన తోట ప్రభ.

నటరాజ, రాయంచ కొక్కుర, సుమన్, సాయికుమార్, రాజీవ్  కనకాల , రాజా రవీంద్ర, శివకుమార్ రామచంద్ర వారపు,వితిక షేరు, వరుణ్ సందేశ్, కస్తూరి, హారిక, కాలకేయ ప్రభాకర్, షఫీ, ఛత్ర పతి శేఖర్ ఐ  డ్రీమ్ అంజలి, సత్య ప్రకాశ్ తదితరులు నటించారు.

టెక్నికల్  టీమ్ 
బ్యానర్: మూవింగ్ డ్రీమ్స్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: సాయి చరణ్ 
ఛాయాగ్రహణం: వెంకట హనుమ 
ఎడిటింగ్: సాయిబాబు తలారి
సంగీతం;  మహా వీర్ యేలెంధర్ 
పీఆర్వో: బి. వీరబాబు
నిర్మాత: మేరుo భాస్కర్
దర్శకత్వం: జై జ్ఞాన ప్రభ తోట