దొంగ నా కొడుకు సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్
పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ సినిమాలతో పాటు కంటెంట్ ఉన్న చిత్రాలను కూడా ప్రోత్సహిస్తోంది. ఈ బ్యానర్‌పై రూపొందుతున్న తాజా చిత్రం ‘దొంగ నా కొడుకు’. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నవంబర్ 13న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తూ ఫస్ట్ సింగిల్ ‘ఓ మై గాడ్’ను విడుదల చేశారు.
సింజిత్ ఎర్రమిల్లి స్వరపరిచిన ‘ఓ మై గాడ్’ రొమాంటిక్ సాంగ్. ఆకట్టుకునే ఆర్కెస్ట్రేషన్‌తో పాటు జోష్‌నిచ్చే బీట్స్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన హీరో మనసులోని భావాలను భాస్కరభట్ల అందంగా అక్షరాల్లోకి తీసుకొచ్చారు. తన సింగిల్ లైఫ్‌ను ప్రేయసి ఎలా మార్చేసిందో, ఆమెతో గడిపే ప్రతి క్షణం తనకు ఎంత విలువైనదో హీరో ఈ పాటలో వ్యక్తం చేస్తాడు. ప్రేమలోని ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఈ పాట చక్కగా ఆవిష్కరిస్తుంది.
రామ్ మిరియాల తనదైన ఎనర్జీ, వాయిస్‌తో పాటకు మరింత జోష్ తీసుకొచ్చారు. ఆయన డైనమిక్ వోకల్స్ ఈ పాటలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆట సందీప్ కొరియోగ్రఫీ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. మౌళి తనూజ్ ప్రశాంత్ తన ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ఆకట్టుకోగా, సుష్మిత శెట్టితో ఆయన కెమిస్ట్రీ క్యూట్‌గా ఉంది. యూత్‌ఫుల్ రొమాంటిక్ వైబ్‌తో సాగిన ఈ పాట ప్రేక్షకులను అలరిస్తోంది.
ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌తో ఆసక్తిని పెంచిన ‘దొంగ నా కొడుకు’.. ఇప్పుడు ఈ మెలోడీతో మ్యూజికల్ ప్రమోషన్స్‌లో జోరు పెంచింది. ఈ సినిమాలో అలీ, రజిత, రఘుబాబు, ప్రియా, గుండు సుదర్శన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలుగా, అనిల్ యెర్నేని కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సింజిత్ ఎర్రమిల్లి సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీధర్ సోంపల్లి ఎడిటర్‌గా, నాగేంద్ర గువ్వల ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.
క్యాచీ కంపోజిషన్, ఆకట్టుకునే సాహిత్యం, రామ్ మిరియాల ఎనర్జిటిక్ వోకల్స్, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీతో ‘ఓ మై గాడ్’ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. యూత్‌ను ఆకట్టుకునే ఈ రొమాంటిక్ నంబర్ మ్యూజిక్ లవర్స్‌ను అలరించడంతో పాటు చార్ట్‌బస్టర్‌గా నిలవనుంది. మరో రెండు వారాల్లో సినిమా విడుదల కానుండటంతో ‘దొంగ నా కొడుకు’ ప్రమోషన్స్ మరింత ఊపందుకోనున్నాయి.
సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో మౌళి మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ముందుగా సందీప్ మాస్టర్ గారికి థాంక్స్ చెప్పాలి. నన్ను కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకొచ్చి ఈ సాంగ్ చేయించారు. ఆయనతో కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. భాస్కర భట్ల గారు అద్భుతంగా లిరిక్స్ రాశారు. అందరికీ అర్థమయ్యేలా, యూత్‌కు కనెక్ట్ అయ్యేలా రాశారు. అలాగే రామ్ మిరియాల గారు నా ఫేవరెట్ సింగర్. ఆయన నా సినిమాకు పాట పాడడం అదృష్టంగా భావిస్తున్నాను. సింజిత్ తన మ్యూజిక్‌తో సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్తాడు. తను నా ఫ్రెండ్ కావడం చాలా ఆనందంగా ఉంది. నా కంఫర్ట్ జోన్ దాటి బయటకు వచ్చాను. యూట్యూబ్‌లో స్టార్ట్ చేశాను. తర్వాత లిటిల్ హార్ట్స్తో యాక్టర్‌గా కూడా విజయం వచ్చింది. ఈ సినిమాకు యాక్టింగ్‌తో పాటు ప్రొడక్షన్ కూడా హ్యాండిల్ చేశాను. మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి చాలా విషయాలు నేర్చుకున్నాను. కంఫర్ట్ జోన్ దాటి బయటకు వస్తే విజయం వస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. చాలా కష్టపడి చేశాం. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా ఇది. నవంబర్ 13న థియేటర్లలో నవ్వుకోవచ్చు. అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమాను ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ శ్రీను కంబాల మాట్లాడుతూ: టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి. మా మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ చాలా మంచి పాటలు ఇచ్చారు. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంటుంది. ఆయనతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే రామ్ మిరియాల గారి ఎనర్జీ ఈ సాంగ్‌కు చాలా హెల్ప్ అయ్యింది. సుష్మిత ఈ క్యారెక్టర్‌ను చాలా పర్ఫెక్ట్గా చేసింది. ఇందులో మౌళి చేసిన డ్యాన్స్ కూడా ఆ క్యారెక్టర్‌కు తగ్గట్టుగానే ఉంటుంది. మీరు ఎంజాయ్ చేస్తారు.
హీరోయిన్ సుష్మిత శెట్టి మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. నేను నార్త్ ఇండియన్ అని అందరూ అనుకుంటున్నారు. కానీ నేను తెలుగు అమ్మాయిని. నాకు ఈ అవకాశం ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్‌కు ధన్యవాదాలు. డైరెక్టర్ గారు సినిమాను చాలా అద్భుతంగా తీశారు. ఈ సాంగ్‌ను చాలా ఎంజాయ్ చేశాను. మౌళితో కలిసి నటించడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. సందీప్ మాస్టర్ బ్యూటిఫుల్‌గా కొరియోగ్రఫీ చేశారు. తప్పకుండా ఈ పాటను థియేటర్లలో చాలా ఎంజాయ్ చేస్తారు.
సందీప్ మాస్టర్ మాట్లాడుతూ: మౌళి ఈ సాంగ్‌ను చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. ప్రతి స్టెప్పును అద్భుతంగా చేశాడు. సింజిత్ గారు అద్భుతమైన ట్యూన్ ఇచ్చారు. రామ్ మిరియాల గారి వాయిస్ మరింత ఎనర్జీ తీసుకొచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో ఫస్ట్ టైమ్ కొరియోగ్రఫీ చేయడం చాలా హ్యాపీగా ఉంది.
మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ మాట్లాడుతూ: ఈ పాట మీ అందరికీ నచ్చడం చాలా హ్యాపీగా ఉంది. ఇందులో చాలా మంచి హుక్ స్టెప్స్ కూడా ఉన్నాయి. ఈ పాట పాడిన రామ్ మిరియాల గారికి, అలాగే పాట రాసిన భాస్కరభట్ల గారికి ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది.
నటీనటులు: మౌళి తనూజ్ ప్రశాంత్, సుష్మిత శెట్టి, అలీ, రజిత, రఘుబాబు, ప్రియా, గుండు సుదర్శన్
రచన, దర్శకత్వం: శ్రీను కంబాల
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
కో-ప్రొడ్యూసర్: అనిల్ యెర్నేని
సినిమాటోగ్రఫీ: సూర్య బాలాజీ
సంగీతం: సింజిత్ ఎర్రమిల్లి
ఎడిటర్: శ్రీధర్ సోంపల్లి
పీఆర్వో: వంశీ-శేఖర్