ఐ బొమ్మ చిత్రం ట్రైలర్ విడుదల 

ఘనంగా "ఐ బొమ్మ" సినిమా ట్రైలర్ లాంఛ్


బానోత్ పవన్, గౌతమ్, నర్మద, సతీష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "ఐ బొమ్మ". ఈ చిత్రాన్ని శ్రీ మల్లన్న క్రియేషన్స్ బ్యానర్ పై కురువ జమన్న నిర్మిస్తున్నారు. విజయ్ రఘునాథభట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా త్వరలో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. బుధవారం హైదరాబాద్ లో "ఐ బొమ్మ" సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

అతిథిగా వచ్చిన నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ - "ఐ బొమ్మ" సినిమా ట్రైలర్ బాగుంది. ఈ రోజు సమాజంలో జరుగుతున్నదే కథగా చూపించారు. ఈ చిత్ర టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. చిన్న చిత్రాల నిర్మాతలకు క్యూబ్ యూఎఫ్ వో ఛార్జీలు భారంగా మారుతున్నాయి. నిర్మాతల మండలికి కొత్తగా ఎన్నికైన మా కార్యవర్గం తరుపున ఈ సమస్యకు పరిష్కారం చేయాలని అనుకుంటున్నాం. అన్నారు.

అతిథిగా వచ్చిన ప్రొడ్యూసర్ రాజా మాట్లాడుతూ - నేను వర్జిన్ బాయ్స్ సినిమా నిర్మించిన తర్వాత డైరెక్టర్ విజయ్ నా దగ్గరకు వచ్చి కలిశాడు. రెండు మూడు స్క్రిప్ట్స్ కూడా చెప్పాడు. మంచి టాలెంట్ ఉన్న యువ దర్శకుడు  విజయ్. ఐ బొమ్మ సినిమా ట్రైలర్ బాగుంది. ఈ సినిమా విజయ్ తో పాటు టీమ్ అందరికీ మంచి పేరు తీసుకురావాలి. అన్నారు.

మూవీ ప్రొడ్యూసర్ కురువ జమన్న మాట్లాడుతూ - మా వృత్తి వ్యవసాయం. సినిమాల మీద ఇష్టంతో చిత్ర నిర్మాణంలోకి వచ్చాను. దర్శకుడు విజయ్ చెప్పిన కథ బాగా నచ్చింది. ఈ కథను ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తారనే నమ్మకం ఉంది. మా చిత్రానికి  మీ అందరి సపోర్ట్ ఉంటుందని నమ్ముతున్నాను. అన్నారు

డైరెక్టర్ విజయ్ రఘునాథభట్ల మాట్లాడుతూ - గతేడాది అంతా ఐ బొమ్మ గురించే న్యూస్ వైరల్ అయ్యింది. మనలో చాలా మంది ఐ బొమ్మ పైరసీ సినిమాలు చూసే ఉంటారు. ఈ సైట్ ఇప్పుడు లేదు కానీ అసలు ఆ సైట్ ప్రారంభించడం వెనక, నిర్వహించడం వెనక ఏం జరిగింది అనేది అందరికీ ఆసక్తికరమే. జీవితంలో కొన్ని సంఘర్షణలకు లోనైన ఓ వ్యక్తి సమాజానికి వ్యతిరేకంగా ఎలా అడుగువేశాడు. అతన్ని ఈ వ్యవస్థ ఎలా పట్టుకుంది. అతని ఆలోచన వెనక ఏం జరిగింది అనే అంశాలతో ఈ సినిమా రూపొందించాం. ఓవర్ ది నైట్ స్క్రిప్ట్ కంప్లీట్ చేసి 15 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేశాం. త్వరలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ కు తీసుకురాబోతున్నాం. అన్నారు.

నటుడు బానోతు పవన్ మాట్లాడుతూ - చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం ఎంతో ప్రయత్నించాను. ఏదైనా లీడ్ రోల్ చేస్తేనే మనకు గుర్తింపు వస్తుందని అనుకున్నాను. అలాంటి టైమ్ లో డైరెక్టర్ విజయ్ ఈ చిత్రంలో లీడ్ రోల్ చేసే అవకాశం కల్పించారు. మా మూవీ మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మీ ముందుకు రాబోతోంది. తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాం. అన్నారు.

నటుడు గౌతమ్ మాట్లాడుతూ - ఈ చిత్రంలో డీఎస్ పీ విక్రమ్ పాత్రలో నటించాను. స్క్రిప్ట్ చెప్పినప్పుడు డైరెక్టర్ విజయ్ లో ఒక మంచి విజన్ చూశాను. ఆయన ఈ సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఈ సినిమా నటుడిగా నాతో పాటు మా టీమ్ అందరికీ విజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాం. అన్నారు.

నటుడు సతీష్ మాట్లాడుతూ - సమాజంలో జరుగుతున్న ఒక వర్తమాన సమస్యను ప్రేక్షకులకు సినిమాగా చూపిస్తే బాగుంటుందనే ఆలోచనతో  ఈ చిత్రాన్ని డైరెక్టర్ విజయ్ రూపొందించారు. మా సినిమా వెనక ఎంతోమంది హార్డ్ వర్క్ ఉంది. ఈ సినిమాను మీరంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.


నటీనటులు - బానోతు పవన్, గౌతమ్, నర్మద, సతీష్, తదితరులు

టెక్నీషియన్స్

ఎడిటర్ - డా.శ్యామ్ కుమార్
డీవోపీ - ఆనంద్ మరుకుర్తి
మ్యూజిక్ - హనుమ ప్రసాద్ యాళ్ల
ప్రొడ్యూసర్ - కురువ జమన్న
స్క్రిప్ట్, డైరెక్షన్ - విజయ్ రఘునాథభట్ల
పీఆర్ఓ - సతీష్.కె