హీరో రామ్ నితిన్  కొత్త మూవీ స్పెషల్ పోస్టర్

హీరో రామ్ నితిన్ బర్త్ డే సందర్భంగా కొత్త మూవీ స్పెషల్ పోస్టర్


"మ్యాడ్" చిత్రంతో యువ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో రామ్ నితిన్ మరో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని వల్లభనేని గిరిబాబు సమర్పణలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. "యూత్" మూవీని తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చిన  ప్రొడ్యూసర్స్ వినీత్, సందీప్ తమ ఈ2సీ టాకీస్ బ్యానర్ పై కో ప్రొడ్యూస్ చేస్తున్నారు. నారా రోహిత్ "సుందరకాండ" ఫేమ్ డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ రోజు హీరో రామ్ నితిన్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా బర్త్ డే స్పెషల్  పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీ బర్త్ డే స్పెషల్ పోస్టర్ కలర్ ఫుల్ కాలేజ్ ఫెస్ట్ వైబ్స్ తో ఆకట్టుకుంటోంది. 'ఫన్, ఫెస్ట్, కెయాస్..బిగిన్స్ సూన్' అంటూ పోస్టర్ లో పెట్టిన క్యాప్షన్ ఈ మూవీ ఎంత ఎంటర్ టైనింగ్ గా ఉండబోతుందో తెలియజేస్తోంది. కాకినాడలోని ఓ కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పక్కా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చిత్రమిది.

"మ్యాడ్" మూవీలో రామ్ నితిన్ చేసిన సందడి ఏ ప్రేక్షకుడూ మర్చిపోలేడు. "ది గర్ల్ ఫ్రెండ్" వంటి పర్పస్ ఫుల్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ రూపొందించిన ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని, కెన్ అండ్ గ్యాంగ్ "యూత్" మూవీ ని తెలుగు ప్రేక్షకులకు అందించి ఫస్ట్ వెంచర్ లోనే సక్సెస్ అందుకున్న యంగ్ ప్రొడ్యూసర్స్ వినీత్, సందీప్, "సుందరకాండ" సినిమాతో యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను అలరించిన డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి అనౌన్స్ మెంట్ నుంచే మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాకు "లిటిల్ హార్ట్స్" ఫేమ్ సింజిత్ యెర్రమల్లి మ్యూజిక్ మరో ప్రత్యేక ఆకర్షణ కాబోతోంది. ఈ సినిమాకు పనిచేస్తున్న కోర్ టీమ్ అంతా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నవారే కావడం విశేషం. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మేకర్స్ ఇవ్వబోతున్నారు.


నటీనటులు - రామ్ నితిన్, తదితరులు

టెక్నికల్ టీమ్
---------------------
మ్యూజిక్ - సింజిత్ యెర్రమల్లి
సమర్పణ - వల్లభనేని గిరిబాబు
బ్యానర్స్ - ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్, ఈ2సీ టాకీస్
ప్రొడ్యూసర్ - ధీరజ్ మొగిలినేని
కో ప్రొడ్యూసర్స్ - వినీత్, సందీప్
స్క్రిప్ట్, డైరెక్షన్ - వెంకటేష్ నిమ్మలపూడి
పీఆర్ఓ - సురేష్ (ఎస్ కె మీడియా) & వంశీ కాక