జయహో రామానుజ సినిమా ట్రైలర్ లాంఛ్


లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా "జయహో రామానుజ". ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్ లో సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా..సుమన్, ప్రవళ్లిక ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ నెల 24న "జయహో రామానుజ" సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో


హీరో, డైరెక్టర్ లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ - సినిమా ఇండస్ట్రీలో పాతికేళ్ల ప్రయాణం నాది. మా మొదటి సినిమా హీరో సుమన్ గారు. ఆయన ఇప్పటికీ అలుపెరుగక సినీ ప్రయాణం చేస్తున్నారు. "జయహో రామానుజ" చిత్రంలో మంచి క్యారెక్టర్ చేశారు. ఆధ్యాత్మిక విప్లవకారుడు రామానుజాచార్యుల జీవిత కథతో ఈ సినిమాను ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి రూపొందించాం. గొప్ప సినిమాలను ప్రజలు తండోపతండాలుగా థియేటర్స్ కు వెళ్లి చూస్తుంటారు. మా సినిమాకు కూడా అలాంటి ఆదరణే దక్కుతుందని నమ్ముతున్నాం. ఈ సినిమాను డబ్బుల కోసం రూపొందించలేదు. రామానుజాచార్యుల వారి గొప్ప కథను ఈ తరం వారికి చూపించాలని ప్రయత్నించాం. టెక్నికల్ గా మంచి క్వాలిటీతో మా సినిమా ప్రేక్షకుల ముందుకు ఈ నెల 24న తీసుకొస్తున్నాం అన్నారు.

నటి, ప్రొడ్యూసర్ ప్రవళ్లిక మాట్లాడుతూ - "జయహో రామానుజ" సినిమాను నిర్మించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. అందుకు మా నాన్న గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాలో నిర్మాణ బాధ్యతల వహిస్తూనే పాటు కృష్ణుడు, నారదుడు, రఘునాథస్వామి పాత్రల్లో నటించాను. ఈ తరం ప్రేక్షకులకు రామానుజాచార్యుల వారి గొప్పదనం తెలియాలి. ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని నమ్మి ఈ సినిమాను నిర్మించాం అన్నారు.

నటుడు సుమన్ మాట్లాడుతూ - ఈ సినిమా గురించి సాయి వెంకట్ గారు చెప్పినప్పుడు చాలా కష్టంతో కూడుకున్న మూవీ కదా అన్నాను. ఆయన మేము ఈ సినిమాను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఆయన చాలా కన్విక్షన్ తో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేసే అవకాశం దక్కింది. మన దేశంలో ఎన్నో మతాలు, కులాలు, వర్గాలు ఉన్నాయి. అయినా మనమంతా కలిసే ఉంటున్నాం. ఈ భావనకు మొదట కృషి చేసింది రామానుజాచార్యులవారు. మనమంతా ఒక్కటే అని ఆయన చెప్పిన గొప్ప మాటలు మనల్ని ఇప్పటికీ ఐక్యంగా నడిపిస్తున్నాయి. ఈ సినిమా మీ ఫ్యామిలీతో కలిసి సంతోషంగా చూడండి. రామానుజాచార్యులవారి గొప్పదనం తెలుసుకోండి అన్నారు.


నటీనటులు – లయన్ సాయి వెంకట్, జో శర్మ, సుమన్, ప్రవళ్లిక అశ్వాపురం వేణుమాధవ్, అప్పం పద్మ, తదితరులు

టెక్నికల్ టీమ్
ప్రెజెంట్స్ : సుదర్శనం హేమలత
బ్యానర్ : సుదర్శనం ప్రొడక్షన్స్
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టన్ : లయన్ సాయి వెంకట్
నిర్మాతలు : సుదర్శనం సాయి ప్రసన్న, సుదర్శనం ప్రవళ్లిక
పి.ఆర్.ఓ : చందు రమేష్