మారెమ్మ మూవీ జూలై రిలీజ్  


మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా 'మారెమ్మ'తో హీరోగా బిగ్ స్క్రీన్ పై అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంతో మంచాల నాగరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మయూర్ రెడ్డి బండారు మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'మారెమ్మ'  ఫస్ట్ లుక్ పోస్టర్‌, టీజర్‌,  ఫస్ట్ సింగిల్ 'బావ బావ' సాంగ్ కి  అద్భుతమైన రెస్పాన్స్  వచ్చింది.

తాజాగా రిలీజ్ టైం పై అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రం 2026 జూలై లో రిలీజ్ కానుంది.

ఈసారి బోనాల జాతర థియేటర్లలో దుమ్ములేపబోతున్నాయ్ అంటూ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ డివైన్ వైబ్ తో అందరినీ ఆకట్టుకుంది.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ప్రశాంత్ అంకిరెడ్డి అందించగా, సంగీతాన్ని ప్రశాంత్ ఆర్ విహారి సమకూర్చారు. ఎడిటర్‌గా దేవ్ రాథోడ్, ఆర్ట్ డైరెక్టర్‌గా రాజ్‌కుమార్ మురుగేసన్ పని చేస్తున్నారు.

తారాగణం: మాధవ్, దీపా బాలు, వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి, V.S.రూపా లక్ష్మి

సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: మోక్ష ఆర్ట్స్
రచన & దర్శకత్వం: మంచాల నాగరాజ్
నిర్మాత: మయూర్ రెడ్డి బండారు
డీవోపీ: ప్రశాంత్ అంకిరెడ్డి
సంగీత దర్శకుడు: ప్రశాంత్ ఆర్ విహారి
ఎడిటర్: దేవ్ రాథోడ్
PRO: వంశీ శేఖర్