ప్రాణంలో ప్రాణమా  చిత్రం  టైటిల్ సాంగ్ ఆవిష్కరణ



శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ప్రొడక్షన్స్ లో రూపొందుతున్న చిత్రం ‘ప్రాణంలో ప్రాణమా’ ఈ సినిమా నుండి టైటిల్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు.

 కుషాల్, అన్విష, జీవన్ రెడ్డి, కమల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఎన్ ఎస్ హనుమంత రెడ్డి నిర్మాత,  భార్గవ గొట్టిముక్కల దర్శకుడు.

తాను ప్రేమిస్తున్న కాజల్ జీవితంలోకి ఇంకో అబ్బాయి రావడంతో, కాజల్ ని అపార్ధం చేసుకుంటాడు కుషాల్.
తరువాత ఒకరునొకరు అర్థం చేసుకొని కుషాల్ కాజల్ లు కలిసిపోతారు. ఇది ఈ చిత్ర ముఖ్య కథాంశం, సరికొత్త స్క్రీన్ ప్లే తో దర్శకుడు భార్గవ గొట్టిముక్కల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు 

ఈ చిత్రానికి డాన్స్ మాస్టర్ జి శంకర్, సినిమాటోగ్రఫీ పిచ్చారాగాడి మణి, లిరిక్: శ్రీరామ్ తపస్వి, మేకప్: నగేష్, సింగర్: వినాయక్. త్వరలో ఈ చిత్రానికి సంబందించిన టీజర్,  ట్రైలర్, రాబోతున్నాయి.