క‌ర్ణ‌ మూవీలో కర్ణుడిగా రాఘవ లారెన్స్

పెన్ మూవీస్‌ అధినేత జయంతిలాల్ గడా సమర్పణలో.. ఆర్‌వీ స్టూడియోస్, శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్‌ అసోసియేషన్‌లో.. దర్శకుడు రమేష్ వర్మ నుంచి ఐదు భాషల్లో తెరకెక్కుతోన్న భారీ పాన్ ఇండియా ఎపిక్ ‘కర్ణ’. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై మహాభారతంలోని మహావీరుడు కర్ణుడి మహాగాథ మరోసారి ఆవిష్కృతం కానుంది. ఈ మహా యోధుడి పాత్రలో ప్రముఖ నటుడు రాఘవ లారెన్స్ నటిస్తున్నారు. దర్శకుడు రమేష్ వర్మ తనదైన విజన్‌తో ఈ పురాణగాథను భారీ స్థాయిలో వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు.

రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రూపొందుతోంది. ఐదు భాషల్లో తెరకెక్కుతోన్న ఈ ప్రతిష్టాత్మక ఎపిక్‌.. అత్యున్నత నిర్మాణ విలువలు, భారీ సాంకేతిక ప్రమాణాలతో ప్రేక్షకులకు ఓ సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు సిద్ధమవుతోంది.

భారీ సెట్స్‌, అద్భుతమైన వరల్డ్ డిజైన్స్‌, భారీ యాక్షన్ సన్నివేశాలు, అత్యున్నత స్థాయి వీఎఫ్‌ఎక్స్‌తో ‘కర్ణ’ ప్రపంచాన్ని ఇంతకుముందెన్నడూ చూడని స్థాయిలో ఆవిష్కరిస్తున్నారు. మహాభారత కాలం నాటి రాజ్యాలు, యుద్ధభూములు, భారీ యుద్ధ సన్నివేశాలు.. ఇలా ప్రతి అంశాన్ని అత్యంత గ్రాండ్‌గా రూపొందిస్తున్నారు.

నిజమైన సెట్స్‌ వైభవానికి అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌ను జోడిస్తూ.. ప్రేక్షకులను కర్ణుడి ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. భారీ స్థాయి విజువల్స్‌తో పాటు కథలోని భావోద్వేగాలు, యాక్షన్‌ సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

గౌరవం, విధి, నమ్మకం, త్యాగం వంటి గొప్ప విలువలకు ప్రతిరూపంగా నిలిచిన మహావీరుడు కర్ణుడు ఈ కథకు కేంద్రబిందువు. కర్ణుడి జీవితంలోని వీరోచితం, భావోద్వేగం, పోరాటం, త్యాగాన్ని భారీ స్థాయి విజువల్ టెల్లింగ్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కర్ణుడిగా రాఘవ లారెన్స్‌ను సరికొత్త అవతార్‌లో చూపించనున్నారు. దర్శకుడు రమేష్ వర్మ తన విజన్‌తో ఈ మహాగాథకు మరింత గ్రాండియర్‌ రూపాన్ని తీసుకొస్తున్నారు. భారీ యాక్షన్‌, అద్భుతమైన విజువల్స్‌, భావోద్వేగాలతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని అందించనుంది.

ఇక ఈ ప్రతిష్టాత్మక ఎపిక్‌కు సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను చిత్రబృందం ఒక్కొక్కటిగా గ్రాండ్‌గా ప్రకటించనుంది. ప్రతి అనౌన్స్‌మెంట్‌ను ప్రత్యేకంగా ప్లాన్ చేస్తూ.. ఈ భారీ ప్రాజెక్ట్‌ వెనుక పనిచేస్తున్న అద్భుతమైన టీమ్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు.

ఇది కేవలం ప్రారంభం మాత్రమే.. ‘కర్ణ’ ప్రపంచం ఒక్కొక్కటిగా ఆవిష్కృతం కానుంది