సంబరాల ఏటిగట్టు మూవీ  డాలీ ధనంజయ్ పోస్టర్  విడుదల


సంబరాల ఏటిగట్టు మూవీ నుంచి అర్జున్ గా డాలీ ధనంజయ్ పోస్టర్
 
మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా చిత్రం సంబరాల ఏటిగట్టు (SYG) షూటింగ్ మొత్తం విజయవంతంగా పూర్తయింది. నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వంలో, ప్రతిష్టాత్మక ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన యాక్షన్ డ్రామా, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశను వేగంగా పూర్తి చేసుకుంటోంది.

‘అసుర ఆగమన’ గ్లింప్స్, మిగతా ప్రమోషనల్ కంటెంట్ కి వచ్చిన అద్భుతమైన స్పందనతో ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తించింది.  

ఈ చిత్రంలో ట్యాలెంటెడ్ యాక్టర్ డాలీ ధనంజయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ధనంజయ్ పుట్టినరోజు సందర్భంగా అర్జున్ పాత్రలో ఆయన్ని పరిచయం చేస్తూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేస్తూ చిత్రబృందం శుభాకాంక్షలు తెలిపింది.

‘అర్జున్’గా ధనంజయ్ లుక్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. సీరియస్ లుక్‌లో కనిపిస్తున్న ఆయన పాత్ర కథలో కీలకమైన ప్రభావాన్ని చూపించబోతున్నట్లు పోస్టర్ సూచిస్తోంది. ‘అర్జున్’ పాత్ర తెరపై ప్రేక్షకులపై చెరగని ముద్ర వేయబోతుంది.

భారీ స్థాయిలో నిర్మించిన ఈ చిత్రాన్ని అనేక ప్రదేశాలలో, భారీ సెట్లతో,  భారీ యాక్షన్ సన్నివేశాలతో చిత్రీకరించారు.

ఈ చిత్రంలో సాయి దుర్గ తేజ్  పవర్ ఫుల్  పాత్రలో కనిపించనున్నారు. దర్శకుడు రోహిత్ కేపీ, బలమైన భావోద్వేగ అంశాలతో పాటు అద్భుతమైన దృశ్యాలు, ఉత్కంఠభరితమైన సన్నివేశాలను మేళవించి ఈ  చిత్రాన్ని ఒక ప్రతిష్టాత్మక యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దుతున్నారు.

ఈ చిత్రంలో ఒక అగ్రశ్రేణి బాలీవుడ్ నటుడు కీలక పాత్ర పోషిస్తుండటం, దీని పాన్-ఇండియా ఎట్రాక్షన్ ను మరింత పెంచుతోంది. ఐశ్వర్య లక్ష్మి, జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ళ కూడా ఈ తారాగణంలో భాగమై, ప్రముఖ పాత్రలలో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక బృందం పని చేస్తోంది. వెట్రివేల్ పళనిస్వామి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఎడిటర్ నవీన్ విజయ్ కృష్ణ, ప్రొడక్షన్ డిజైనర్ గాంధీ నడికుడికర్,  ఫైట్ మాస్టర్స్ పీటర్ హెయిన్స్, రామ్ లక్ష్మణ్, చేతన్, పృథ్వీ,  ఈ చిత్రం విజువల్ వండర్ గా వుండబోతోంది.

సంబరాల ఏటిగట్టు 2027 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది.

తారాగణం: సాయి దుర్గ తేజ్, ఐశ్వర్య లక్ష్మి, జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, డాలీ ధనంజయ్, అనన్య నాగళ్ల

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రోహిత్ కె.పి
నిర్మాతలు: కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి
బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్
DOP: వెట్రి పళనిసామి
సంగీతం: బి అజనీష్ లోక్‌నాథ్
ఎడిటర్: నవిన్ విజయ్ కృష్ణ
ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ నడికుడికర్
ఫైట్స్: పీటర్ హెయిన్స్, రామ్ లక్ష్మణ్, చేతన్, పృధ్వి
కాస్ట్యూమ్ డిజైనర్: అయేషా మరియం
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా