STBL సినిమాస్, ప్రొడక్షన్ నెం 1 చిత్రం షూటింగ్ పూర్తి 


STBL సినిమాస్, ప్రొడక్షన్ నెం 1 ఎంటర్‌టైనర్‌ షూటింగ్ పూర్తి 

శివాజీ ప్రధాన పాత్రలో STBL సినిమాస్ నిర్మాణ సంస్థ తొలి చిత్రంగా తెరకెక్కుతున్న  సినిమా షూటింగ్ పూర్తయింది. రవికృష్ణ, కసిరెడ్డి, భరణ్, ఖుష్బూ, రాధ్య, మౌనిక కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్‌ ‘M3’. 72 రోజుల పాటు సాగిన షూటింగ్‌ను చిత్ర యూనిట్ విజయవంతంగా పూర్తి చేసింది.

షూటింగ్ పూర్తయిన సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్‌లో శివాజీ సంప్రదాయ దుస్తుల్లో  హుందాగా కనిపించారు. శివాజీ పాత్ర ఎలా ఉండబోతోందన్న ఆసక్తిని ఈ లుక్ మరింత పెంచుతోంది.

STBL Cinemas సంస్థ ద్వారా బాలాజీ V.R. దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మంచి యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు.

కుటుంబ కథా చిత్రాలు తగ్గుతున్న ప్రస్తుత రోజుల్లో, కుటుంబంలోని ప్రతి ఒక్కరూ కలిసి చూసి ఆనందించేలా, మంచి సందేశంతో పాటు ఆద్యంతం నవ్వులు పూయించే విధంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

ఈ చిత్రానికి ప్రవీణ్ కె. పోతునూరి  సంగీతం అందిస్తునారు. వెంకట్ డీవోపీ గా పని చేస్తున్నారు. అశోక్ వడ్లమూడి, భాను మొగలిపువ్వు మాటలు అందిస్తున్నారు.

ఈ సినిమాను డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు.

నటీనటులు: శివాజీ, రవికృష్ణ, కసిరెడ్డి, భరణ్, ఖుష్బూ, రాధ్య, మౌనిక

సాంకేతిక బృందం:
నిర్మాణ సంస్థ: STBL Cinemas
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బాలాజీ V.R.
సంగీతం: ప్రవీణ్ కె. పోతునూరి
డీవోపీ: వెంకట్
మాటలు: అశోక్ వడ్లమూడి, భాను మొగలిపువ్వు
పీఆర్వో: వంశీ శేఖర్