వదలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌

వదలా మూవీ ట్రైలర్ నాకు చాలా నచ్చింది - అనిల్ రావిపూడి

చరిత చిత్ర బ్యానర్ మీద కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ సంయుక్తంగా నర్మించిన చిత్రం ‘వదలా’. జగపతి బాబు, లయ, హృతిక శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో ఆకెళ్ల వి కృష్ణ ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ మూవీని జూలై 17న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.  

ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెన్సేషనల్ డైరెక్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేశారు. 

ఈ ఈవెంట్‌లో..

అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. ‘తెలుగు ఇండస్ట్రీలోకి నిర్మాతగా వస్తున్న కిషోర్ గారికి థాంక్స్. ‘వదలా’ చిత్రంతో నిర్మాత కిషోర్ గారికి మంచి విజయం దక్కాలి. తమ్మారెడ్డి గారు, జగపతి బాబు గారి మీదున్న ప్రేమ, గౌరవంతో ఇక్కడకు వచ్చాను. ‘వదలా’ ట్రైలర్ నాకు చాలా నచ్చింది. కాన్సెప్ట్, కథ చాలా కొత్తగా అనిపించింది. పాటలు నాకు చాలా నచ్చాయి. ట్రైలర్‌ను చూస్తే అందరూ సహజంగా నటించారని అర్థం అవుతోంది. చోటా గారు అందరికీ సన్నిహితులు. ఆయన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. తమ్మారెడ్డి గారు ఏదైనా సరే కుండ బద్దలు కొట్టినట్టు కాదు.. ముక్కలు చేసినట్టుగా మాట్లాడతారు. జగపతి బాబు అంటే ఫ్యామిలీ హీరో. జగపతి బాబు గారు అన్ని రకాల పాత్రల్ని, సినిమాల్ని చేశారు. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మాలాంటి అప్ కమింగ్ దర్శకులందరికీ వరం. ఆయనకు ఈ మూవీతో మంచి విజయం దక్కాలి. జూలై 17న అందరూ ‘వదలా’ మూవీని చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

జగపతి బాబు మాట్లాడుతూ .. ‘‘వదలా’ లాంటి థ్రిల్లర్ మూవీని చేయడం ఆనందంగా ఉంది. ఇదొక ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్. ఈ మూవీలో విషయం ఉంది, కంటెంట్ ఉంది అని నమ్మాను. అందుకే ప్రతీ విషయంలో నేను జాగ్రత్తగా తీసుకున్నాను. ఈ ‘వదలా’ చిత్రాన్ని వదలకుండా నాకోసం చూడండి. ఈ సినిమాకి ఇంకా బిజినెస్ కాలేదు. మా తమ్మారెడ్డి గారు, కిషోర్ గారు ధైర్యంతో ముందు అడుగు వేశారు. ఆడియెన్స్ సినిమా చూసి మాకు డబ్బులు ఇస్తారని ఆశిస్తున్నాను. ఈ సినిమాకి చోటా గారు, కార్తీక్ గారు కనిపించని హీరోలు. ఈ ప్రయాణంలో మాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. లయ గారితో నాకెన్నో ఏళ్ల నుంచి మంచి అనుబంధం ఉంది. ఆమె ఇప్పుడే ఇంకా అల్లరి చేస్తున్నారు (నవ్వుతూ). హృతిక ఎంతో సెలెక్టెడ్‌గా పాత్రల్ని ఎంచుకుంటోంది. కార్తీక్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. మాకోసం వచ్చిన అనిల్ రావిపూడికి థాంక్స్. తల ఎత్తుకుని తిరిగే సినిమాల్ని తీశాడు. అందరి క్షేమం కోరుకునే వ్యక్తి. మున్ముందు మరిన్ని మంచి పాత్రల్ని పోషించాలని అనుకుంటున్నాను. ఒక వేళ ‘వదలా’ మూవీని ప్రేక్షకులు ఆదరిస్తే.. హీరోగా ఇలాంటి డిఫరెంట్ పాత్రల్ని కూడా ప్రయత్నిస్తాను. ప్రేక్షకులు మా చిత్రాన్ని వదలకుండా చూసి ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ .. ‘సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి యాభై ఏళ్లు అవుతోంది. ఓ పదేళ్ల క్రితం వైరాగ్యంతో సినీ సన్యాసం తీసుకుంటే.. కిశోర్ గారు మాత్రం ‘వదలా’ అనే సినిమా నిర్మించాల్సిందే అని పట్టు పట్టారు. పన్నెండేళ్ల క్రితం మేకింగ్ ఆపేశాను. చోటాతో ఎలా పని చేస్తామో అనుకున్నా.. కానీ సెట్‌లో ఎంతో సరదాగా ఉండేవారు. అవుట్ పుట్ చూశాక అద్భుతం అనిపించింది. నా ప్రొడక్షన్స్‌లో ‘అంత:పురం’ తర్వాత ఇదే బెస్ట్ ఫిల్మ్. గ్లింప్స్ రిలీజ్ అయిన తర్వాత అమెరికా నుంచి ఫోన్స్ వచ్చాయి. ‘లెనిన్’తో పాటుగా మా ట్రైలర్‌ను థియేటర్లో ప్రదర్శిస్తుంటే మంచి రెస్పాన్స్ వస్తోంది. మాకు మంచి సలహాలు ఇచ్చిన వెంకట్ గారికి థాంక్స్. మా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లందరికీ థాంక్స్. కార్తిక్‌ని, లిరిసిస్ట్‌లను బాగానే హింసించాను (నవ్వుతూ). పిలిచిన వెంటనే చెప్పిన టైంకి వచ్చిన అనిల్ రావిపూడి గారికి థాంక్స్. జూలై్ 17న వదలకుండా మా ‘వదలా’ సినిమాని చూడండి’ అని అన్నారు.

నిర్మాత కిషోర్ నాయుడు చిరుమామిళ్ల మాట్లాడుతూ .. ‘మా ‘వదలా’ ఈవెంట్‌కు వచ్చిన అనిల్ రావిపూడి గారికి థాంక్స్. తమ్మారెడ్డి గారి వల్లే నేను నిర్మాతగా నిలబడగలిగాను. ప్రతీ రోజూ సెట్‌లో 150 మందికి భోజనం పెట్టాను. అదే నాకు అదృష్టం. జగపతి బాబు గారు, లయ గారు, చోటా గారు, దర్శకుడు వంశీ, వంశీ-శేఖర్‌ల ఆత్మీయత నాకెంతో నచ్చింది. జూలై 17న మా సినిమాకి ప్రేక్షకులు వచ్చే వరకు నేను ‘వదలా’ (నవ్వుతూ). నేను సంకల్పంతో చేసిన ప్రతీ పని విజయం సాధించింది. మధ్య ప్రదేశ్‌లో సెటిల్ అయిన నేను ఇక్కడకు వచ్చి డబ్బు గురించి కాకుండా మనుషుల గురించే ఆలోచించాను. ఈ సినిమా కూడా నా సంకల్పంతో హిట్ అవుతుందని నమ్ముతున్నాను’ అని అన్నారు.

‘రాజు వెడ్స్ రాంబాయి’ నిర్మాత నాగేశ్వర్ రావు మాట్లాడుతూ .. ‘‘వదలా’ ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. ఈ మూవీలోని మ్యూజిక్ నిజంగానే నన్ను వదలడం లేదు. ఈ చిత్రంలో పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. ఈ మూవీ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.


హృతిక శ్రీనివాస్ మాట్లాడుతూ .. ‘‘వదలా’ చిత్రంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఇందులో నాదొక డిఫరెంట్ పాత్ర. నాకు ఈ అవకాశం ఇచ్చిన వంశీ గారికి, జగపతి బాబు గారికి థాంక్స్. మా అత్త ఆమని సహకారంతోనే ఇక్కడి వరకు వచ్చాను. లయ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. కార్తీక్ గారి మ్యూజిక్ బాగుంది. చోటా గారు మా అందరినీ అందంగా చూపించారు. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. జూలై 17న మా సినిమా వస్తోంది.. అందరూ వదలకుండా మా మూవీని చూడండి’ అని అన్నారు.


సంగీత దర్శకుడు కార్తీక్ బి. కొడకండ్ల మాట్లాడుతూ .. ‘‘వదలా’ మూవీకి నాకు అవకాశం ఇచ్చిన వంశీ గారికి, తమ్మారెడ్డి గారికి థాంక్స్. ఫస్ట్ పాట విన్న వెంటనే జగపతి బాబు గారు ఇంటికి పిలిచి మరీ అభినందించారు. అపజయం ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి మా కోసం రావడం ఆనందంగా ఉంది. ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చిన వంశీ గారికి, జగపతి బాబు గారికి, తమ్మారెడ్డి గారికి, కిషోర్ గారికి థాంక్స్’ అని అన్నారు.


కెమెరామెన్ చోటా కె. నాయుడు మాట్లాడుతూ .. ‘‘వదలా’ లాంటి థ్రిల్లర్ చిత్రాలు అంటే నాకు చాలా ఇష్టం. ఈ మూవీలో బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ లిరిక్స్ ఉంటాయి. ఏం కావాలంటే అది చేయండి అని నాకు భరోసానిచ్చిన కిషోర్ గారికి థాంక్స్. వంశీ కథను నెరేట్ చేసిన తీరు అద్భుతంగా అనిపించింది. జగపతి బాబు ఎంతో ఎనర్జిటిక్‌గా నటించారు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన తమ్మారెడ్డి గారికి, జగపతి బాబు గారికి థాంక్స్’ అని అన్నారు.


లిరిసిస్ట్ కృష్ణవేణి మల్లవజ్జల మాట్లాడుతూ .. ‘‘వదలా’ చిత్రానికి పాటలు రాయడం ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ గారు, తమ్మారెడ్డి గారికి థాంక్స్. దర్శకుడు వంశీ గారు ఫోన్లోనే సిట్యూవేషన్‌ను వివరించేవారు. జగపతి బాబు గారికి పాటలు రాయడం సంతోషంగా ఉంది’ అని అన్నారు.


లిరిసిస్ట్ శివకృష్ణాచారి ఎర్రోజు మాట్లాడుతూ .. ‘‘వదలా’ చిత్రంలో టైటిల్ సాంగ్ రాశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన కార్తీక్ గారికి, వంశీ గారికి, తమ్మారెడ్డి గారికి థాంక్స్’ అని అన్నారు.

లిరిసిస్ట్ వీరు గడ్డం మాట్లాడుతూ .. ‘‘వదలా’ చిత్రానికి పాటలు రాసే అవకాశం ఇచ్చిన కార్తీక్ గారికి, వంశీ గారికి థాంక్స్. వంశీ గారు చేసిన ‘ది ట్రిప్’ సినిమాకి కూడా పాటలు రాశాను. చోటా గారు నా పాటల్ని మెచ్చుకున్నారు. తమ్మారెడ్డి గారు నన్ను అభినందించారు. నాకు అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

నటీనటులు: జగపతి బాబు, లయ, హృతిక శ్రీనివాస్

సాంకేతిక బృందం
బ్యానర్: చరిత చిత్ర
నిర్మాతలు : కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ
దర్శకుడు: ఆకెళ్ల వి కృష్ణ
DOP : చోటా కె. నాయుడు
సంగీత దర్శకుడు : కార్తీక్ బి. కొడకండ్ల
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
PRO : వంశీ, శేఖర్