They Call Him OG Review
Emotional Engagement Emoji
స్టోరీలైన్ :
ముంబై పోర్ట్ కి దాదా అయినటువంటి సత్య దాదా (ప్రకాష్ రాజ్) కి
అండగా ఓజాస్ గంభీర (పవన్ కళ్యాణ్) ఉంటాడు. గంభీర అంటే బాంబే లో ఉన్న
గ్యాంగ్ స్టర్స్ అందరికి హడల్. కానీ ఓ కారణం చేత గంభీర సత్య దాదా
నుంచి దూరం కావాల్సి వస్తుంది. అక్కడ నుంచి ఆ పోర్ట్ పై చాలా మంది
కన్ను పడుతుంది. గంభీర ఎందుకు సత్య దాదాకి దూరం అయ్యాడు? అసలు
ఇద్దరికీ లింక్ ఎలా కుదిరింది? అర్జున్ (అర్జున్ దాస్) గంభీరని ఎందుకు
చంపాలి అనుకుంటాడు. ఇంకో పక్క ఓమిగా పిలవబడే ఓంకార్ వర్ధమాన్
(ఇమ్రాన్ హష్మీ) తాలూకా rdx కంటైనర్లు సత్య దాదా పోర్ట్ వచ్చాక
ఏమయ్యాయి? కణ్మయి కి (ప్రియాంక అరుల్ మోహన్) కి ఏమైంది ? అసలు ఈ
గంభీర ఎవరు? అతని గతం ఏంటి అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని
చూడాల్సిందే.
ఎనాలసిస్ :
Omi కి OG కి మధ్య యుద్ధం.
ఆర్టిస్ట్లఫెరఫార్మెన్స్ :
ఒక గ్యాంగ్ స్టర్ గా పవర్ స్టార్ తన మార్క్ స్వాగ్ అండ్ స్క్రీన్
ప్రెజెన్స్ తో స్క్రీన్ పై అభిమానులని అలరించారు. యాక్షన్
సీక్వెన్స్ లో అయితే పవన్ కళ్యాణ్ స్టైల్ నెక్స్ట్ లెవెల్.
వింటేజ్ లుక్ లో పవన్ కళ్యాణ్ లుక్ చాలా బాగుంది.
Omi గా ఇమ్రాన్ హష్మీ పవర్ఫుల్ గా మరియు స్టైలిష్ గా కనిపించాడు .
ఇమ్రాన్ హష్మి నటన చాలా బాగుంది. . ఇక వీరితో పాటుగా అర్జున్ దాస్ కి
మంచి రోల్ దక్కింది. తనకు చాలా ఇంపార్టెన్స్ ఇందులో కనిపించగా తనతో
పాటుగా నటి శ్రేయ రెడ్డి కూడా సాలిడ్ రోల్ లో కనిపించి
మెప్పిస్తుంది.
ప్రకాష్ రాజ్ సత్య దాదాగా ఎప్పటిలానే మంచి నటన కనబరిచారు. శుభలేఖ
సుధాకర్ క్యారెక్టర్ బాగుంది.
టెక్నికల్గా :
దర్శకుడు సుజీత్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక జంబో ప్యాక్ బిర్యానీ ఇచ్చాడు. ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ని ఎలా
చూడాలనుకొంటున్నారో ఆలా చూపించాడు. పవన్ కళ్యాణ్ గారి మీద యాక్షన్ సీక్వెన్స్ పెట్టి సినిమా అంతా
నడిపించాడు.
రవి కె చంద్రన్, మనోజ్ పరమహంసల సినిమాటోగ్రఫీ వర్క్ కూడా పీక్ లెవెల్లో ఉంది. సాలిడ్ విజువల్స్ ని
తాము ప్రెజెంట్ చేశారు. థమన్.. ఈ మ్యాన్ కోసం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినిమాకి థమన్
మ్యాజిక్ బాగా ప్లస్ అయ్యింది. నవీన్ నూలి ఎడిటింగ్ కూడా బాగుంది. ఈ సినిమాలో నిర్మాణ విలువలు
మాత్రం సాలిడ్ గా ఉన్నాయి.
చూడచ్చా :
చూడొచ్చు
ప్లస్పాయింట్స్ :
పవన్ కళ్యాణ్ , ఇమ్రాన్ హష్మి , మిగతా ఆర్టిస్ట్స్ ల నటన
యాక్షన్ సీక్వెన్స్ ,
థమన్ మ్యూజిక్
మైనస్పాయింట్స్ :
ఎమోషనల్ కనెక్టివిటీ
తీర్పు :
ఫీస్ట్ ఫర్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ ..
నటీనటులు:
పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్, ఇమ్రాన్ హష్మీ, అర్జున్
దాస్, ప్రకాష్ రాజ్, శ్రేయ రెడ్డి, కిక్ శ్యామ్ తదితరులు
సాంకేతికవర్గం :
సినిమాటైటిల్ : ‘ They Call Him OG ‘
బ్యానర్: DVV Entertainment
విడుదలతేదీ: 25-09-2025
సెన్సార్రేటింగ్: “ A “
దర్శకత్వం: సుజీత్
సంగీతం: ఎస్.ఎస్. తమన్
సినిమాటోగ్రఫీ: రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాత: డీవివి దానయ్య, కళ్యాణ్ దాసరి
రన్టైమ్: 154 నిమిషాలు