Reading Time: < 1 min

Power Movie Launched

పవర్ మూవీ ప్రారంభం

సాయికృష్ణ హీరోగా వెంకట రమణ పసుపులేటి దర్శకత్వంలో “పవర్” మూవీ ప్రారంభం
టాలీవుడ్ స్క్రీన్ పైకి యంగ్ అండ్ డైనమిక్ హీరో రాబోతున్నాడు. సాయికృష్ణ హీరోగా, దర్శకుడు వెంకటరమణ పసుపులేటి రూపొందిస్తున్న మూవీ “పవర్”. ఈ మూవీ తాజాగా ఘనంగా ప్రారంభమైంది. “నాది పొగరు కాదురా… నా జాతికి ఈ దేవుడు ఇచ్చిన పవర్…” అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో సాయికృష్ణ సినీ ఎంట్రీ ఇచ్చారు. మంగళగిరి పరిధిలోని ఆత్మకూరులో వంగవీటి రంగా విగ్రహం వద్ద ముహూర్తం షాట్‌తో చిత్రీకరణ ప్రారంభమైంది.
ప్రారంభోత్సవంలో సాయికృష్ణ పర్సనాలిటీ, అభినయం అతిథులను ఆకట్టుకుని ప్రశంసలు అందుకున్నాయి. ఈ చిత్రంలో అరుణ్ విజయ్, సుజన, భాగ్యశ్రీ, ప్రజ్ఞ, ప్రియతో పాటు సీనియర్ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రం యువతను ఆకట్టుకునే శక్తివంతమైన కథాంశంతో, అద్భుతమైన సాంకేతిక విలువలతో రూపొందుతోంది. సాయికృష్ణ హీరోగా ఈ చిత్రం టాలీవుడ్‌లో కొత్త ఒరవడిని సృష్టిస్తుందని చిత్ర యూనిట్ భరోసా వ్యక్తం చేసింది.
*సాంకేతిక బృందం వివరాలు*:
సంగీతం: శంకర్ మహదేవన్
సినిమాటోగ్రఫీ: బి. ఎస్. కుమార్
మేకప్: కుమార్
ఎడిటింగ్: నందమూరి హరి.
పీ.ఆర్.ఓ: కడలి రాంబాబు, దయ్యాల అశోక్
సమర్పణ: ఎస్.ఐ.ఎఫ్.ఏ.ఏ
కథ, స్క్రీన్ ప్లే  మాటలు దర్శకత్వం: వెంకటరమణ పసుపులేటి