SK21 మూవీ టైటిల్ టీజర్ ఫిబ్రవరి 16 విడుదల

Published On: February 13, 2024   |   Posted By:

SK21 మూవీ టైటిల్ టీజర్‌ ఫిబ్రవరి 16 విడుదల

శివకార్తికేయన్, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ SK21 టైటిల్ టీజర్‌ ఫిబ్రవరి 16న విడుదల

స్టార్ హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా ఉలగనాయగన్ కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI), సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందుతోంది. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివకార్తికేయన్‌ కు జోడిగా సాయి పల్లవి నటిస్తోంది.

తాజాగా ఈ సినిమా టైటిల్ టీజర్‌ కి సంబధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఫిబ్రవరి 16న SK21 టైటిల్ టీజర్‌ ని లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ఒక స్టన్నింగ్ వీడియో ని షేర్ చేశారు. ఈ వీడియో శివకార్తికేయన్ జిమ్ లో ఇంటెన్స్ వర్క్ ఔట్స్ చేస్తూ కనిపించారు. అలాగే డిఫరెంట్ గన్స్ ని ఫైర్ చేస్తూ కనిపించడం క్యురియాసిటీ పెంచింది.

SK21లో శివకార్తికేయన్‌ను ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా బిగ్ స్క్రీన్ పై ప్రజంట్ చేయనున్నారు. గట్స్ అండ్ గోర్ దేశభక్తి కథాంశంతో ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది.

అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. స్టార్ కంపోజర్ జి వి ప్రకాష్ సంగీతం సమకూరుస్తున్నారు. రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్. సినిమాటోగ్రాఫర్ గా సిహెచ్ సాయి, ఎడిటర్ గా ఆర్. కలైవానన్, యాక్షన్ డైరెక్టర్ గా స్టీఫన్ రిక్టర్ పని చేస్తున్నారు.

తారాగణం:

శివకార్తికేయన్, సాయి పల్లవి

సాంకేతిక విభాగం :

రచన, దర్శకత్వం: రాజ్ కుమార్ పెరియసామి
నిర్మాతలు: కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్
బ్యానర్లు: RKFI, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ: సిహెచ్ సాయి
ఎడిటర్: కలైవానన్ ఆర్