Reading Time: < 1 min

Sunil Birthday Special Article
సునీల్ పుట్టిన రోజు ప్రత్యేకత

కమెడియన్ సునీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కమెడియన్ గా మాత్రమే కాదు హీరోగా కూడా సినిమాలు చేసి మెప్పించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా ఒక్కమాటలో చెప్పాలంటే విలక్ష నటుడిగా పాన్ ఇండియా చిత్రాలతో మెప్పిస్తున్నారు. ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా సునిల్ సినిమా జర్నీ గురించి తెలుసుకుందాం. ఇప్పటి వరకు 200 కు పైగా తెలుగు చిత్రాల్లో నటించిన సునిల్ హాస్యనటుడిగా నువ్వే కావాలి, నువ్వు నేను, నువ్వు నాకు నచ్చావ్, నువ్వే నువ్వే, సొంతం, మనసంతా నువ్వే, అతడు, ఆంధ్రుడు సినిమాల్లోని పాత్రలు మంచి గుర్తింపు సాధించి పెట్టాయి.

అందాలరాముడు, పూలరంగడు, మర్యాదరామన్న, కథా స్క్రీన్ ప్లే అప్పల్రాజు వంటి చిత్రాల్లో హీరోగా నటించి విమర్శకులు ప్రశంసలు అందుకున్నారు. 2003లో నువ్వు నేను, 2006 లో ఆంధ్రుడు చిత్రాలకిగాను ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారం అందుకున్నాడు. మర్యాద రామన్న చిత్రానికి గాను స్పెషల్ జ్యూరీ పురస్కారం లభించింది. వీటితో పాటు మిస్టర్ పెళ్ళికొడుకు, తడాఖా, భీమవరం బుల్లోడు, కృష్ణాష్టమి, జక్కన్న, ఈడు గోల్డ్ ఎహే, ఉంగరాల రాంబాబు వంటి చిత్రాల్లో సైతం కథనాయకుడిగా నటించారు. ప్రస్తుతం పుష్ప చిత్రంలో మంగళం సినిమా పాత్రలో ఆయన ఒదిగిన తీరు అందరిని మెప్పిస్తుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మరిన్ని సినిమాలు చేయాలని బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ తరఫున కోరుకుంటూ సునీల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము.