Emotional Engagement Emoji
స్టోరీలైన్ :
జై (నితిన్) వరల్డ్ ఆర్చరీ లో ఛాంపియన్ కావలనుకుంటాడు. కానీ తన గురి మాత్రం ఎప్పుడూ తప్పుతూ ఉంటుంది. దీనితో తను ఎందుకు ఏకాగ్రత చేయలేకపోతున్నాడు అనేది గతంలో తన కుటుంబం అక్క స్నేహాలత (లయ) విషయంలో జరిగిన ట్రాజడీ అని తెలుసుకుంటాడు. దీనితో తన స్నేహితురాలు చిత్ర (వర్ష బొల్లమ్మ) తో తన అక్క, కుటుంబం అంబరగొడుగు అనే
ప్రాంతంలో ఉన్నారని తెలుసుకొని స్టార్ట్ అవుతాడు. ఇంకోపక్క వైజాగ్ లో జరిగిన ఓ ఘోర ఫ్యాక్టరీ ప్రమాదం దాని ఓనర్ అజర్వాల్ (సౌరబ్) దాని నుంచి తప్పించుకోడానికి చేసే ప్రయత్నాలు ఏంటి? దీనికి నితిన్ అక్కకి ఎదురయ్యే ప్రమాదం ఏంటి? నితిన్ తన అక్కతో కలిసాడా లేదా? చివరికి ఆ ఫ్యాక్టరీ ప్రమాదంలో కోల్పోయిన ప్రాణాల కుటుంబాలకు న్యాయం జరిగిందా లేదా అనేది మిగిలిన స్టోరీ..
ఎనాలసిస్ :
గురి తప్పినా తమ్ముడు
ఆర్టిస్ట్ల ఫెరఫార్మెన్స్ :
నితిన్ తన డీసెంట్ పెర్ఫార్మన్స్ ని అందించాడు. కొన్ని యాక్షన్ సన్నివేశాలు అలాగే ఇంకొన్ని మూమెంట్స్లో నితిన్ నటన చాలా బాగుంది. విలన్ నటుడు సౌరబ్ పాత్ర డిజైన్ చేసిన విధానం అందరి పాత్రల కంటే బెటర్ గా అనిపిస్తుంది. తన రోల్ ని కూడా సౌరబ్ అంతే సాలిడ్ పెర్ఫార్మన్స్ అందించారు.
టెక్నికల్గా :
దర్శకుడు వేణు శ్రీరామ్ విషయానికి వస్తే.. ఫ్యామిలీ డ్రామాలో యాక్షన్ అడ్వెంచర్ మిక్స్ చేసినట్లుంది . ఈ సినిమాలో ఎమోషనల్ డెప్త్ లేదు, కథా కథనాలు కూడా చాలా బోరింగ్ గా తను నడిపించారు. ప్రొడక్షన్ డిజైన్ కూడా బానే ఉంది. అయితే VFX కొన్ని చోట్ల బెటర్ గా చేయాల్సింది.
చూడచ్చా :
నితిన్ ఫాన్స్ వరకు..
ప్లస్పాయింట్స్ :
నితిన్
సౌరబ్ సచిదేవ యాక్టింగ్
యాక్షన్ సీన్స్
మైనస్పాయింట్స్ :
స్టోరీ
తీర్పు :
మిస్ ఫైర్ అయ్యిన తమ్ముడు
నటీనటులు:
నితిన్, లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, సౌరబ్ తదితరులు
సాంకేతికవర్గం :
సినిమాటైటిల్ : ‘తమ్ముడు’
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
విడుదలతేదీ: 04-07-2025
సెన్సార్రేటింగ్: “ A “
దర్శకత్వం: వేణు శ్రీరామ్
సంగీతం: అజనీష్ లోకనాథ్
సినిమాటోగ్రఫీ: కెవి గుహన్, సమీర్, సేతు
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
నిర్మాత: దిల్ రాజు-శిరీష్
రన్టైమ్: 154నిమిషాలు
మూవీరివ్యూ : రావ్-సాన్ ఫిల్మ్స్