Top 8th Actor 2024
టాప్ 8వ యాక్టర్ 2024
తెలుగు పరిశ్రమలో చాలామంది హీరోలు ఉన్నారు. వారికి కోట్లల్లో అభిమానులు ఉన్నారు. అందరిలో ఎవరు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు అంటే మాత్రం అంత సులువుగా చెప్పడం కష్టం. అయితే సినిమా విజయాన్ని బట్టి ఏ హీరో అగ్రస్థానంలో ఉన్నాడో చెప్పగలం. అలాగే సినిమాకు వచ్చిన కలెక్షన్లను బట్టి, హీరో తీసుకున్న పారితోషికాన్ని బట్టి, హీరో చేసిన సినిమాలను బట్టి కూడా వారి స్థానాలను నిర్ణయించడం ఒక పద్ధతి. అయితే 2024లో విడుదలైన సినిమాలు ఆ చిత్రాలలో కథానాయకులుగా వారు పోషించిన పాత్రలు అవి ప్రేక్షకులకు కనెక్ట్ అయిన విధానాన్ని బట్టి టాప్ 10 హీరోలలో ఎనిమిదవ స్థానంలో ఉన్న హీరో ఎన్టీఆర్.
కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రం డివైడర్ తెచ్చుకున్నప్పటికీ నటనలో మాత్రం ఎన్టీఆర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. రెండు విభిన్నమైన పాత్రలతో తెరపై అలరించారు. దేవరగా ఆయన ప్రేక్షకుల హృదయాలను మీటారు. ఇంకా సినిమాలో కొన్ని ఎమోషన్స్ ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ అవలేదు. కానీ నటన పరంగా ఎన్టీఆర్ టాప్ లోనే ఉన్నారు. దేవరలో ద్విపాత్రాభినయంలో మెప్పించారు. ఆయన గతంలో త్రిపాత్రాభినయం చేసిన సినిమా జైలవకుశ. ఎన్నో అద్భుతమైన చిత్రాలతో అలరించే ఎన్టీఆర్ 2001లో నిను చూడాలని చిత్రంతో డెబ్యూ హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తరువాత ఎస్ఎస్ రాజమౌళితో స్టూడెంట్ నెం 1, వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆది చిత్రాల తరువాత వెనక్కి తిరిగి చూడలేదు. వరుసగా అల్లరి రాముడు, నాగ, సింహాద్రి, ఆంధ్రవాలా, నా అల్లుడు, ఆశోక్, రాఖీ, యమదొంగ, అదుర్స్, శక్తి, ఊసరవెల్లి, దమ్ము, బాద్షా, రామయ్య వస్తావయ్య, రభసా , టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్, జై లవ కుశ, అరవింద సమేతా, ఆర్ఆర్ఆర్, దేవర చిత్రాలు తీశారు. తరువాత
వార్2, దేవర పార్ట్ 2 చిత్రాలు లైనప్ లో ఉన్నాయి.