Vijay Devarakonda on Film fare Cover Page
ఫిలింఫేర్ కవర్ పేజీపై హీరో విజయ్ దేవరకొండ
హీరో విజయ్ దేవరకొండ స్టైలిష్ ఫొటోతో ప్రముఖ మూవీ మేగజైన్ ఫిలింఫేర్ మే నెల కవర్ పేజీ పబ్లిష్ చేసింది. విక్టరీ మార్చ్ టైటిల్ తో టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా దాకా విజయ్ దేవరకొండ ఒక స్టార్ గా ఎదిగిన తీరును ఈ ఎడిషన్ లో అనలైజ్ చేసింది. విజయ్ దేవరకొండ కవర్ పేజీతో ఉన్న ఫిలింఫేర్ మే నెల మేగజైన్ మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటోంది.
తన అప్ కమింగ్ మూవీ “కింగ్డమ్”తో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు విజయ్ దేవరకొండ రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా మీద పాన్ ఇండియా స్థాయిలో ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. “కింగ్డమ్” సినిమా జూలై 4వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.