రాగల 24 గంటల్లో చిత్రం సెప్టెంబర్‌ విడుదల

Published On: July 6, 2019   |   Posted By:
రాగల 24 గంటల్లో చిత్రం సెప్టెంబర్‌ విడుదల
 
గతంలో అదిరిందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా, యమగోల మళ్ళీ మొదలైంది, బొమ్మనా బ్రదర్స్‌ – చందన సిస్టర్స్,  ఢమరుకం వంటి ఎన్నో హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వంలో ఈషా రెబ్బా మొదటిసారి హీరోయిన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ లో నటిస్తున్న చిత్రం ‘రాగల 24 గంటల్లో’. ఈ చిత్రంలో హీరో సత్యదేవ్, శ్రీనవ్‌హాస్‌ క్రియేషన్స్ పతాకంపై శ్రీ కార్తికేయ సెల్యులాయిడ్స్‌ సమర్పణలో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి శ్రీనివాస్‌ కానూరు నిర్మాత. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సెప్టెంబర్‌ 5న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ– ‘‘నా మొదటి సినిమా శ్రీనివాస్‌ రెడ్డి వంటి మంచి దర్శకుడితో చేయడం చాలా ఆనందంగా ఉంది. చెప్పిన కథను చెప్పినదానికంటే గొప్పగా తెరకెక్కించారు, అనుకున్న బడ్జెట్‌ లో అనుకున్న రోజుల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. నిర్మాత అంటే డబ్బులు పెట్టడమే కాదు, ప్రతిరోజు షూటింగ్‌ కి వచ్చి దగ్గరుండి అన్నీ చూసుకోవాలని సినిమా నిర్మాణం గురించి అన్నీ వివరించి చెప్పారు. అలాగే ప్రతిరోజు షూటింగ్‌ కి వెళ్లి అన్ని శాఖల వారి పని తీరును చూసాను, నాకు ఎంతో బాగా అనిపించింది. స్వతహాగా బిజినెస్‌మేన్‌ అయిన నేను సినిమా నిర్మాణం ఎంత కష్టమో, ఎంత కష్టపడతారో కళ్లారా చూసాను. ఈ సినిమా అయిన వెంటనే శ్రీనివాస్‌ రెడ్డి గారితోనే మరో సినిమా చేస్తున్నాను’’ అన్నారు.
 
దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘కొంత గ్యాప్‌ తర్వాత మంచి కంటెంట్‌ తో కూడిన మంచి సినిమా స్క్రిప్ట్‌ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా.100% ఇది అన్ని వర్గాల వారికీ నచ్చే సినిమా. ఇది స్క్రీన్‌ ప్లే బేస్డ్ తో చేసిన అద్భుతమైన సస్పెన్స్‌ ధ్రిల్లర్‌ సినిమా. ఈషా రెబ్బ ఈ సినిమా తర్వాత పెద్ద హీరోయిన్ల జాబితాలో చేరుతుంది అంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసింది.  హీరో గా నటించిన సత్యదేవ్‌ ఈ సినిమా తర్వాత మంచి హీరోగా బిజీ అవుతాడు . అతనొక వండర్ ఫుల్‌ ఆర్టిస్ట్‌. అలాగే ఈ చిత్రంలో మరో ముఖ్యపాత్రలో హీరో శ్రీరామ్‌ నటించారు. ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ హాస్యనటుడు కృష్ణభగవాన్‌ మాటలు రాయడం. ముస్కాన్‌ సేథీ, గణేష్‌ వెంకట్రామన్, కృష్ణ భగవాన్, అనురాగ్, అజయ్, టెంపర్‌ వంశీ, రవిప్రకాష్, రవివర్మ, అదిరే అభి ముఖ్యపాత్రలు పోషించారు. 
 
ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఆలీబాబా,  సంగీతం రఘు కుంచె, ఫోటోగ్రఫీ: అంజి, మాటలు: కృష్ణ భగవాన్, ఎడిటర్‌: తమ్మిరాజు, ఆర్ట్‌: చిన్న, కథ: శ్రీనివాస్‌ వర్మ.
 
 
 
 
26 Attachments