అల్ల‌రి న‌రేష్‌ బ‌ర్త్‌డేకి విడుద‌ల కానున్న నాంది చిత్రం ఎఫ్ఐఆర్

హీరో అల్ల‌రి న‌రేష్‌ త్వ‌ర‌లో ‘నాంది’ అనే విల‌క్ష‌ణ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. స్టార్ డైరెక్ట‌ర్‌ హ‌రీష్ శంక‌ర్ ద‌గ్గ‌ర కో-డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

ఎస్‌వీ 2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమాకు సంబంధించి లాక్‌డౌన్ విధించ‌క ముందే 80 శాతం షూటింగ్ పూర్త‌యింది.

జూన్ 30 అల్ల‌రి న‌రేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ‘నాంది ఎఫ్ఐఆర్’ (ఫ‌స్ట్ ఇంపాక్ట్ రివీల్‌) పేరిట ఒక చిన్న గ్లింప్స్‌ను విడుద‌ల చేస్తున్నారు . 

‘నాంది’ ఎనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌లో, ఆందోళ‌న నిండిన ముఖంతో జైలులో న‌గ్నంగా కూర్చొని ఉన్న అల్ల‌రి న‌రేష్‌ను మ‌నం చూశాం. ఆ పోస్ట‌ర్ చూస్తేనే ఇప్ప‌టివ‌ర‌కూ చేయ‌ని ఒక అసాధార‌ణ పాత్ర‌ను ఆయ‌న చేస్తున్నాడ‌ని అర్థ‌మైపోయింది. 

తారాగ‌ణం:
అల్ల‌రి న‌రేష్‌, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, న‌వ‌మి, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, ప్ర‌వీణ్‌, ప్రియ‌ద‌ర్శి, దేవీప్ర‌సాద్‌, విన‌య్ వ‌ర్మ‌, సి.ఎల్‌. న‌ర‌సింహారావు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, ర‌మేష్‌రెడ్డి, చ‌క్ర‌పాణి, రాజ్య‌ల‌క్ష్మి, మ‌ణిచంద‌న‌, ప్ర‌మోదిని.

సాంకేతిక వ‌ర్గం:
క‌థ‌:  తూమ్ వెంక‌ట్‌
డైలాగ్స్‌: అబ్బూరి ర‌వి
సాహిత్యం:  చైత‌న్య ప్ర‌సాద్‌, శ్రీ‌మ‌ణి
సంగీతం:  శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల‌
సినిమాటోగ్ర‌ఫీ:  సిద్‌
ఎడిటింగ్‌:  చోటా కె. ప్ర‌సాద్‌
ఆర్ట్‌: బ‌్ర‌హ్మ క‌డ‌లి
ఫైట్స్‌:  వెంక‌ట్‌
పీఆర్వో:  వంశీ-శేఖ‌ర్‌
లైన్ ప్రొడ్యూస‌ర్‌:  రాజేష్ దండా
నిర్మాత‌: స‌తీష్ వేగేశ్న‌
స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  విజ‌య్ క‌న‌క‌మేడ‌ల‌.