అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రం ప్రారంభ‌O
 
 
విష్వ‌క్ సేన్ హీరోగా ఎస్‌వీసీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్‌పై ప్రారంభ‌మైన కొత్త చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’
 
ఫలక్‌నుమాదాస్‌, హిట్ వంటి వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో న సూప‌ర్‌హిట్స్ అందుకున్న యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో విష్వ‌క్‌సేన్‌. ఈయ‌న క‌థానాయ‌కుడిగా ప్ర‌ముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌వీసీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్‌పై బాపినీడు.బి, సుధీర్ నిర్మిస్తోన్న ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ శుక్ర‌వారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.
 
దుర్గ‌(విష్వ‌క్ సేన్ అమ్మ‌గారు) ఈ సినిమా ముహూర్తపు స‌న్నివేశానికి క్లాప్‌కొట్టారు. విద్యాసాగ‌ర్ చింత ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.
 
ఈ సంద‌ర్భంగా ….
 
నిర్మాత‌లు బాపినీడు.బి, సుధీర్ మాట్లాడుతూ ‘‘‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ అనే టైటిల్ ఎంత డిఫ‌రెంట్‌గా ఉందో, సినిమా కూడా అలాగే ఉంటుంది. ల‌వ్‌, ఫ‌న్ స‌హా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. ఇప్ప‌టి వ‌ర‌కు విష్వ‌క్ సేన్ న‌టించిన, న‌టిస్తోన్న చిత్రాల‌కు ఇది పూర్తి భిన్న‌మైన చిత్రం. విష్వ‌క్ లుక్ కూడా కొత్త‌గా ఉంటుంది.ఈ చిత్రానికి ర‌వికిర‌ణ్ రైట‌ర్‌. విద్యాసాగ‌ర్ చింత ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ సినిమాలో హీరోయిన్ స‌హా ఇత‌ర న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ ఎవ‌ర‌నే విష‌యాన్ని త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం’’ అన్నారు. 
 
న‌టీన‌టులు:  
విష్వ‌క్ సేన్‌
 
సాంకేతిక నిపుణులు:
 
బ్యాన‌ర్‌:  ఎస్‌వీసీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్‌
స‌మ‌ర్ప‌ణ‌:  బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్‌
నిర్మాత‌లు:  బాపినీడు.బి, సుధీర్‌
ద‌ర్శ‌క‌త్వం:  విద్యాసాగ‌ర్ చింత‌
రైట‌ర్:  ర‌వికిర‌ణ్‌