అసుర‌గ‌ణ రుద్ర చిత్రం ప్రారంభం

కమ్జుల ప్రొడక్షన్స్ త‌మ‌ తొలి చిత్రంగా `అసుర‌గ‌ణ రుద్ర`చిత్రాన్ని నిర్మిస్తోంది.

న‌రేష్ అగ‌స్త్య‌, సంగీర్త‌న విపిన్‌, ఆర్య‌న్ రాజేష్ త‌దితరులు న‌టించ‌నున్న ఈ చిత్రం ద్వారా ముర‌ళీ కాట్ర‌గ‌డ్డ ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ముర‌ళీ వంశీ నిర్మిస్తున్నారు.

ఆదివారంనాడు ఈ చితం ప్రారంభోత్స‌వం జూబ్లీహిల్స్‌లోని దైవ‌స‌న్నిదానంలో జ‌రిగింది. పూజా కార్య‌క్ర‌మాలు అనంత‌రం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బి.గోపాల్ ముహూర్త‌పుషాట్‌కు క్లాప్ కొట్టారు. అనంత‌రం చిత్ర యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. మ‌రో అతిథి సి. క‌ళ్యాణ్ చిత్ర యూనిట్ శుభాకాంక్ష‌లు తెలుపుతూ, నిర్మాత‌, ద‌ర్శ‌కుల‌కు మంచి పేరు రావాల‌నీ, ఇంకా మ‌రిన్ని సినిమాలు తీసే స్థాయికి ఎద‌గాల‌ని ఆకాంక్షించారు.

చిత్ర నిర్మాత వంశీ మాట్లాడుతూ, మా అన్న ముర‌ళీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. మా సినిమాకు వ‌చ్చి ఆశీర్వ‌దించిన బి.గోపాల్, సి. క‌ళ్యాణ్ ల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాం. మా బేన‌ర్‌లో ఇది తొలి సినిమా. ఇదే టీమ్‌తో మ‌రో సినిమా చేయ‌బోతున్నాం. అది కూడా త్వ‌ర‌లో వెల్ల‌డిస్తాం. అసుర‌గ‌ణ రుద్ర చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ఏప్రిల్ 6నుంచి వుంటుంది. మొద‌టిరోజే రెయిన్ ఫైట్‌తో యాక్ష‌న్ సీన్‌ను చేయ‌బోతున్నాం. అదేవిధంగా, ఈ చిత్రం గురించి టైటిల్ కాంటెస్ట్‌ను ఏర్పాటు చేశాం. న‌రేష్ అగ‌స్త్య‌, శ‌త్రు, ముర‌ళీ శ‌ర్ర‌మ‌, అమిత్ ఈ న‌లుగురిలో ఎవ‌రు టైటిల్ పాత్ర‌ను పోషిస్తున్నార‌నేది చెబితే ఫ‌స్ట్  ప్రైజ్ ల‌క్ష రూపాయ‌లు, సెకండ్ ప్రైజ్ 50వేలు, మూడో బ‌హుతి 25వేలు ఇవ్వ‌నున్నాం. ఈ కాంటెస్ట్ వివ‌రాలు మా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పెట్టాం. గెలుపొందిన‌వారికి ఆ పాత్ర పోషించిన వారి చేతుల‌మీదుగా ప్రైజ్ మ‌నీ అందిస్తాం అని అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు ముర‌ళీ కాట్ర‌గ‌డ్డ మాట్లాడుతూ, ఈ సినిమాకు ప‌నిచేస్తున్న వారంతా నా స్నేహితులే. టైటిల్ రోల్ ప్లే చేస్తున్న పాత్ర చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా వుంటుంది. హీరోని డామినేట్ చేసేదిగా వుంటుంది. `అసుర‌గ‌ణ రుద్ర` మెడిక‌ల్ క్రైం థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో రూపొందుతోంది. చూసేవారికి భయం క‌లిగించేవిధంగా వుంటుంది. ఇందులో అభిన‌య కీల‌క పాత్ర పోషిస్తున్నారు. క‌థంతా ఆమె చుట్టూరా సాగుతుంది. థ్రిల్ల‌ర్ సినిమాలో బెస్ట్ సినిమా అవుతుంద‌నే న‌మ్మ‌క‌ముంది. ఈనెల 6నుంచి రెగ్యుల‌ర్ షూట్ ప్రారంభించి మే1కి మొద‌టిషెడ్యూల్ పూర్తి చేస్తాం అన్నారు.

ఇంకా ఈ చిత్రంలో పాల్గొన్న న‌టీన‌టులు మాట్లాడుతూ, టైటిల్ ఎంత హాంటింగ్ వుంటుందో క‌థ కూడా అంత‌కంటే బాగుంటుంది.  చ‌క్క‌టి టీమ్‌లో మేమూ భాగ‌మైనందుకు ఆనందంగా వుంద‌ని పేర్కొన్నారు.

న‌టీన‌టులు-
న‌రేష్ అగ‌స్త్య‌, సంగీర్త‌న విపిన్‌, ఆర్య‌న్ రాజేష్, మురళీ శ‌ర్మ‌, ఆమ‌ని, శ‌త్రు, అమిత్‌, అభిన‌య‌, దేవీ ఫ్ర‌సాద్ త‌దిత‌రులు
సాంకేతిక‌త‌-
కెమెరాః అమ‌ర‌నాథ్ బొమ్మిరెడ్డి, సంగీతంః శేఖ‌ర్ చంద్ర‌, ఫైట్స్ః న‌బా మాస్ట‌ర్‌, ఎడిట‌ర్ః శ్రీ‌కాంత్ ప‌ట్నాయ‌క్‌, ఎగ్జిక్యూటివ్ నిర్మాతః శ్రీ‌హ‌రి గౌడ్‌, నిర్మాతః ముర‌ళీ వంశీ, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంః  ముర‌ళీ కాట్ర‌గ‌డ్డ‌,