ఈగల్ మూవీ రివ్యూ

Published On: February 9, 2024   |   Posted By:

ఈగల్ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

ఢిల్లీ లో పని చేసే నళిని రావు(అనుపమ) అనుకోకుండా ఒక స్పెషల్ కాటన్ క్లాత్ చూసి దాన్ని కొనే టైం లో ఆ క్లాత్ పండించే ఊరి గురించి , దానికి పబ్లిసిటీ చేసి అందరికి అందుబాటులోకి తీసుకొచ్చిన సహదేవ్ వర్మ మిస్ అయ్యాడు అని తెలుసుకొంటుంది. దీని గురించి ఆమె పేపర్లో ఆర్టికల్ రాయడంతో సిబిఐ వాళ్ళు ఆ న్యూస్ ని బయటకి రాకుండా చేస్తారు. అసలు సహదేవ్ వర్మ ఎవరు? సిబిఐ ఆ న్యూస్ రాకుండా ఎందుకు అడ్డుకొంది? ఎక్కడో యూరోప్ లో కాంట్రాక్టు కిల్లింగ్ చేసే snipar సహదేవ్ తలకోన అడవుల్లో ఏమి చేస్తున్నాడు? సహదేవ్ భార్య రచనకి ఏమైంది? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చుడాలిసిందే.

ఎనాలసిస్ :

కాంట్రాక్టు కిల్లింగ్ చేసుకొనే వ్యక్తి ఒక అమ్మాయి ప్రేమలో పడి .. ఆ అమ్మాయి చనిపోతే తాను చేసే పని వదిలేసి అక్రమంగా వచ్చిన ఆయుధాల్ని అరికట్టడం.

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :

రవితేజ మోస్ట్ స్టైలిష్ గా కనిపించాడు. తక్కువ డైలాగ్స్ తో ఎక్కువ eye ఎక్స్ప్రెషన్స్ తో బాగా నటించాడు. ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ పాత్ర లో అనుపమ బాగా నటించింది. కావ్య నటన కూడా బాగుంది. నవదీప్,వినయ్ రాయ్ ,అవసరాల శ్రీనివాస్,మధుబాల ,అజయ్ ఘోష్ తమ పాత్రలకు న్యాయం చేసారు.

టెక్నికల్ గా :

డేవ్ జాంద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సాంగ్స్ విజువల్ గా బాగున్నాయి. కార్తీక్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు హై రేంజ్ లో ఉన్నాయి. ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ చాలా బాగుంది.

చూడచ్చా :

చూడొచ్చు

ప్లస్ పాయింట్స్ :

రవితేజ నటన,
యాక్షన్ సీక్వెన్స్ , గన్స్ ఫైట్
ఫస్ట్ హాఫ్..

మైనస్ పాయింట్స్ :

కన్ఫ్యూషన్ స్క్రీన్  ప్లే

తీర్పు :

ఈగల్ ఒక స్టైలిష్ అండ్ ఎంగేజింగ్ యాక్షన్ ఎంటర్ టైనర్..

నటీనటులు:

రవితేజ, కావ్య థాపర్,అనుపమ పరమేశ్వరన్, వినయ్ రాయ్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, అజయ్ ఘోష్ తదితరులు

సాంకేతికవర్గం :

సినిమా టైటిల్ : ఈగల్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
విడుదల తేదీ: 09-02-2024
సెన్సార్ రేటింగ్: “ U/A “
దర్శకత్వం: కార్తీక్ గడ్డంనేని
సంగీతం: డేవ్ జాంద్
సినిమాటోగ్రఫీ: కార్తీక్ గడ్డంనేని, కమిల్ ప్లాకి, కర్మ్ చావ్లా
ఎడిటింగ్: కార్తీక్ ఘట్టమ్నేని
నిర్మాత: TG విశ్వ ప్రసాద్
నిజాం డిస్ట్రిబ్యూటర్: గ్లోబల్ సినిమాస్ LLP
రన్‌టైమ్: 158 నిమిషాలు

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్