ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీ ఏప్రిల్ 2024 లో షూటింగ్ ప్రారంభం

Published On: October 5, 2023   |   Posted By:

ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీ ఏప్రిల్ 2024 లో షూటింగ్ ప్రారంభం

ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ భారీ బ‌డ్జెట్ మూవీ ఏప్రిల్ 2024 లో షూటింగ్ ప్రారంభం

మేన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్  ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని అభిమానాన్ని, క్రేజ్‌ను సంపాదించుకున్న హీరో. ఆయ‌న క‌థానాయ‌కుడిగా కె.జి.య‌ఫ్‌, కె.జి.య‌ఫ్ 2 వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్స్‌ను తెర‌కెక్కించి త్వ‌ర‌లోనే స‌లార్‌తో సంద‌డి చేయ‌నున్న ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది.

ప్ర‌స్తుతం ఎన్టీఆర్ దేవ‌ర మూవీ షూటింగ్‌ను పూర్తి చేసే ప‌నిలో నిమ‌గ్న‌మై ఉన్నారు. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌బోతున్న భారీ బ‌డ్జెట్ చిత్రం, ఏప్రిల్ 2024 నుంచి ప్రారంభం కానుంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా ఈ చిత్రాన్ని రూపొందించ‌నున్నాయి. ఈ సినిమాపై ఎలాంటి అంచ‌నాలుంటాయో అంద‌రికీ తెలిసిందే. ఈ ఎక్స్‌పెక్టేష‌న్స్ ధీటుగా మేక‌ర్స్ మూవీని నిర్మించ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్‌ను డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ సిద్ధం చేస్తున్నారు. అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయేలా భారీ యాక్ష‌న్ చిత్రాల‌ను తెర‌కెక్కించే ఈ డైరెక్ట‌ర్ మ‌రోసారి ఎన్టీఆర్‌తో అంద‌రినీ మెప్పించేలా యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను తెర‌కెక్కించ‌బోతున్నారు.