ఎల్‌జిఎం చిత్రం ప్రారంభం

Published On: January 27, 2023   |   Posted By:

ఎల్‌జిఎం చిత్రం ప్రారంభం

ధోని ఎంటర్‌టైన్‌మెంట్స్ తొలి చిత్రం ఎల్‌జిఎం చిత్రం గ్రాండ్ గా ప్రారంభం

మహేంద్ర సింగ్‌ ధోనీ సాక్షి ప్రొడక్షన్ హౌస్ ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఎల్‌జీఎం షూటింగ్‌ ఈరోజు ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సాక్షితో పాటు పలువురు ప్రముఖులు పూజా కార్యక్రమానికి హాజరయ్యారు.

లెట్స్ గెట్ మ్యారేడ్ నూతన దర్శకుడు రమేష్ తమిళమణి దర్శకత్వం వహిస్తున్నారు. సాక్షి కాన్సెప్ట్ తో స్వయంగా రూపొందిస్తున్నారు. ఇందులో నటులు హరీష్ కళ్యాణ్, నదియా, ఇవానా ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ హాస్యనటుడు యోగి బాబు మరో కీలక పాత్ర పోషిస్తున్నారు.

విశ్వజిత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు రమేష్ తమిళమణి స్వయంగా సంగీతం అందిస్తున్నారు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ ప్రొడక్షన్‌లోకి అడుగుపెట్టిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ఉండబోతుంది.

సినిమా స్క్రిప్టు కాన్సెప్ట్‌ను రూపొందించిన సాక్షి ధోని సినిమా ప్రారంభం కావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి మరిన్ని మంచి కథలు మరిన్ని చేయడానికి ఎదురుచూస్తున్నాము” అని సాక్షి చెప్పారు.

ఈ చిత్రానికి స్క్రిప్ట్‌ను కూడా అందించిన దర్శకుడు రమేష్ తమిళమణి మాట్లాడుతూ, “గొప్ప ప్రయాణాన్ని ప్రారంభించేందుకు మేము సంతోషిస్తున్నాము. ఈ వినోదభరితమైన చిత్రం మొత్తం కుటుంబం ఆనందించేలా ఉంటుందని హామీ ఇస్తున్నాను  అన్నారు.

ఈ సందర్భంగా ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బిజినెస్‌ హెడ్‌ వికాస్‌ హసిజా మాట్లాడుతూ అర్థవంతమైన కథల ద్వారా దేశంలోని నలుమూలల ఉన్న భారతీయ ప్రేక్షకులకు చేరువవ్వడమే ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ లక్ష్యం. ఆ ఆలోచనకు తగ్గట్టుగానే ఈ సినిమా రూపొందుతోంది  అన్నారు

ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ క్రియేటివ్‌ హెడ్‌ ప్రియాంశు చోప్రా మాట్లాడుతూ “ఈ చిత్రం ప్రారంభోత్సవం సందర్భంగా చాలా ఆనందంగా వుంది. సాక్షి కాన్సెప్ట్‌ని, రమేష్‌ దానిని వినోదాత్మకంగా స్క్రిప్ట్‌గా ఎలా మలిచాడో ప్రత్యక్షంగా చూశాను. ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను  అన్నారు.

నటీనటులు :

హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా, యోగి బాబు

టెక్నికల్ టీం :

సంగీతం, దర్శకత్వం: రమేష్ తమిళమణి
బ్యానర్ : ధోని ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాతలు : సాక్షి ధోని
డీవోపీ: విశ్వజిత్