ఏది నిజం చిత్రం ప్రారంభం
 
నూతన నటీనటులతో ప్రారంభమైన కొత్త చిత్రం “”ఏది నిజం”
 
ఎస్ ఎస్ సి క్రియోసన్స్ మరియు రుద్రాని స్టూడియోస్ సంయుక్తంగా శ్రీ పుష్పాంజలి క్రీయోసన్స్ సమర్పిసుండగా నిర్మిస్తున్న నూతన చిత్రాన్ని మాజీ ఎమ్మెల్యే సీనియర్ నటులు బాబూమోహన్ చేతుల మీదగా శ్రీ కృష్ణ నగర్ ఆంజనేయ స్వామి టెంపుల్ లో ఘనంగా పూజా కార్యక్రమాలు జరిగాయి.
 
అనంతరం  సీనియర్ నటులు బాబూమోహన్ మాట్లాడుతూ… ఈ చిత్రంలో అందరూ కొత్త నటీనటులతో పాటు టెక్నీషియన్స్ చేయటం చాలా ఆనందంగా ఉంది.మంచి కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ ఇందులో నటించిన అందరికీ  అందరికీ మంచి పేరు వచ్చి చిత్రం ఘన విజయం సాధించాలన్న రు.
 
దర్శకులు సంపత్ శ్రీను మాట్లాడుతూ….ఇందులో నటీనటులు కొత్తవారు అయిన మంచి కథతో చిత్రాని నిర్మిస్తున్నాం ఐదుగురు నటీనటులు ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.పల్లెటూరు. పట్టణ ప్రాంతాల్లో యువత సమస్యలపై తీస్తున్న కథ అన్నారు.
 
జబర్దస్త్ కామెడీ యన్ అప్పారావు మాట్లాడుతూ…..ఏది నిజం చిత్రం  నా చేతుల మీదగా స్విచ్ ఆన్ చేయటం సంతోష కరమని సినిమాలో  నటించిన అందరికీ మంచి పేరు వచ్చి చిత్రం మంచి విజయం సాధిచాలన్నారు .
 
హీరోయిన్స్ ఐశ్వర్య హన్విక మాట్లాడుతూ… ఈ సినిమాలో మాకు మంచి పాత్రలు చేయడం ఆనందంగా ఉంది అందరి సహకారంతో చిత్రం విజయం సాధించాలని తెలిపారు. 
 
హీరో రవికుమార్ మాట్లాడుతూ…. కథ నచ్చి  సినిమాలో హీరోగా చేస్తున్నాను.  సినిమాలో అన్ని అంశాలు అందరికీ నచుతాయన్నారు
.
హీరో.రవికుమార్
హీరోయిన్స్ ఐశ్వర్య హాన్వి క
జబర్దస్త్ అప్పారావు
సంగీతం  శ్రాన్
ఎడిటర్  రుద్రా ని స్టూడియోస్
నిర్మాతలు. సురేష్ ఆత్రేయ సంపత్ శ్రీను లక్ష్మణ్ రావు మహేష్ చౌదరి చంద్రమోహన్
కథ- స్క్రీన్ ప్లే – దర్శకత్వం  సంపత్ శ్రీను