ఏ మాస్టర్ పీస్ సినిమా టీజర్ జూన్ 7 విడుదల

శుక్ర, మాటరాని మౌనమిది వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు సుకు పూర్వజ్ రూపొందిస్తున్న కొత్త సినిమా ఏ మాస్టర్ పీస్. అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్, అషు రెడ్డి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ప్రతిష్టాత్మక ఫిల్మ్ ప్రొడక్షన్ స్టూడియో మెర్జ్ ఎక్స్ ఆర్ తో కలిసి సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల,మనీష్ గిలాడ ఏ మాస్టర్ పీస్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కలిసిన ఒక న్యూ కాన్సెప్ట్ సూపర్ హీరో మూవీ ఎక్సీపిరియన్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందించబోతోంది.

ఈ రోజు ఏ మాస్టర్ పీస్ సినిమా టీజర్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. జూన్ 7వ తేదీ మధ్యాహ్నం 3.33 నిమిషాలకు టీజర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అద్భుతమైన విజువల్స్, భారీ మేకింగ్, విజువల్ ఎఫెక్టులతో ఏ మాస్టర్ పీస్ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు సుకు పూర్వజ్. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ ఏడాదిలోనే ఏ మాస్టర్ పీస్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హై స్టాండర్డ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో యూనిక్ సూపర్ హీరో ఫిల్మ్ గా ఏ మాస్టర్ పీస్ ఉండబోతోంది.

నటీనటులు :

అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్, మనీష్ గిలాడ, స్నేహ గుప్త, అర్చనా అనంత్, జయప్రకాశ్, తదితరులు

టెక్నికల్ టీమ్ :

సినిమాటోగ్రఫీ శివరామ్ చరణ్
సంగీతం ఆశీర్వాద్
ఎడిటర్  సుకు పూర్వజ్ ,మనోజ్ కుమార్. బి, శివ శర్వాని
బ్యానర్స్  సినిమా బండి, మెర్జ్ ఎక్స్ ఆర్
నిర్మాత  శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ , ప్రజయ్ కామత్
రచన, దర్శకత్వం  సుకు పూర్వజ్