ఐపీఎల్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
 
అంకిత ప్రొడక్షన్స్ “ఐపీఎల్” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన నటులు తనికెళ్ళ భరణి
 
బీరం వరలక్ష్మి సమర్పణలో, అంకిత ప్రొడక్షన్స్ పతాకంపై, విశ్వ కార్తికేయ, నితిన్ నాష్, అవంతిక, అర్చన గౌతమ్ హీరో హీరోయిన్లుగా, సురేష్ లంకల పల్లి దర్శకత్వంలో, బీరం  శ్రీనివాస్ నిర్మిస్తున్న సినిమా *ఐపీఎల్*. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ నటుడు,దర్శకుడు, రచయిత తనికెళ్ళ భరణి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో లో చిత్ర హీరోలు విశ్వ కార్తికేయ, నితిన్ నాష్, నిర్మాత డిఎస్ రావు, రచ్చ రవి,చిత్ర నిర్మాత బీరం శ్రీనివాస్, చిత్ర దర్శకుడు సురేష్ లంకలపల్లి, మ్యూజిక్ డైరెక్టర్ వెంగీ, సినిమాటోగ్రాఫర్ ak ఆనంద్, తదితర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
 
శ్రీ తనికెళ్ళ భరణి మాట్లాడుతూ:  IPL సినిమా మంచి ఎంటర్ టైనర్.ఈ సినిమా మంచి హిట్ అయ్యి నిర్మాతకు డబ్బులు,దర్శకుడికి నటి నటులకు టెక్నీషియన్స్ కు మంచి పేరు రావాలి.
దర్శకుడు సురేష్ లంకలపల్లి మాట్లాడుతూ: ఇందులో ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్స్ వున్నారు. సీనియర్ నటి నటులు నటించారు.లాస్ట్ షెడ్యూల్ ఈ నెలాఖరు నుంచి స్టార్ట్ చేస్తాము.త్వరలోనే ప్రేక్షకుల ముందు కు తీసుకొస్తాం.నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత శ్రీనివాస్ గారికి నా కృతజ్ఞతలు.
 
హీరో విశ్వ కార్తికేయ మాట్లాడుతూ; సబ్జెక్ట్ బాగుంది. ఈ ప్రాజెక్ట్ యాక్ట్ చేయడం చాలా హ్యాపీ గా వుంది.సినిమా లాస్ట్ దశలో వుంది. దర్శకులు సురేష్ ఎంతో డెడికేటెడ్ తో తెరకెక్కిస్తున్నారు.నిర్మాత శ్రీనివాస్ గారు మరిన్ని బర్త్ డే వేడుకలు జరుపుకోవాలి.
 
హీరో నితిన్ నాష్ మాట్లాడుతూ: ఈరోజు పోస్టర్ లాంచ్ చేసాము.డైరెక్టర్ సురేష్ వెరి ప్రామిసింగ్.నిర్మాత ప్రోత్సాహం మరువలేను.ఈ సినిమా అందరికీ నచ్చుతుంది.
 
నిర్మాత డిఎస్ రావు మాట్లాడుతూ: ఈ కథ నాకు తెలుసు.యూనిట్ సమక్షంలో ఘనంగా పోస్టర్ లాంచ్ జరిగింది. నిర్మాత శ్రీనివాస్ మంచి మిత్రుడు మంచి కథను ఎంచుకొని సినిమాను తీస్తున్నాడు.
 
రచ్చరవి మాట్లాడుతూ; ఈ ipl సినిమా మంచి పూర్ లవ్, క్రికెట్ ipl ఈ సినిమా ఐపీఎల్ రెండు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.నిర్మాత శ్రీనివాస్ గారు నాకు మంచి అవకాశం ఇచ్చారు.
 
చిత్ర నిర్మాత బీరం శ్రీనివాస్ మాట్లాడుతూ: నా పుట్టిన రోజు సందర్భంగా మా సినిమా ఐపీఎల్ పోస్టర్ లాంచ్ తనికెళ్ళ భరణి గారు ఆవిష్కరించారు.  ఈ సినిమా క్రికెట్ బెట్టింగ్స్ నేపథ్యంలో యువత లైఫ్ ఎలా నాశనం చేసుకుంటున్నారు అనే కథాంశంతో తెరకెక్కుతుంది. మంచి సాంగ్స్ వున్నాయి.మంచి మ్యూజిక్ ఇచ్చాడు వెంగి. తనికెళ్ళ భరణి, పోసాని, సుమన్ రచ్చారవి మంచి క్యారెక్టర్స్ చేశారు. సినిమా లాస్ట్ షెడ్యూల్ తొందరలో పూర్తి చేసి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. మా సినిమా ను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు అని అన్నారు.
 
తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి,సుమన్,డిఎస్ రావు,చైతన్య,ఈరోజుల్లో సాయి, రచ్చ రవి, రామ్ ప్రసాద్  తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వెంగి, సినిమాటోగ్రఫీ: AK ఆనంద్, ఎడిటర్: జానకి రామ్, ఆర్ట్: వెంకట్, యాక్షన్: సతీష్, కాస్ట్యూమ్స్: ఆనంద్, ప్రొడక్షన్ కంట్రోలర్: రామాంజనేయులు, కో డైరెక్టర్; తిరుమల కుమార్, నిర్మాత: బీరం శ్రీనివాస్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్: సురేష్ లంకలపల్లి.