కనులు కనులను దోచాయంటే థియేటర్ల పెంపు
 
 
ప్రేక్షకుల కోరిక మేరకు ‘కనులు కనులను దోచాయంటే’ థియేటర్లు పెంచుతున్నాం
– కెఎఫ్‌సి ఎంటర్‌టైన్‌మెంట్స్‌
 
పెద్ద చిత్రాల నుండి చిన్న చిత్రాల వరకూ… కొన్నేళ్లుగా నిర్మాతలు అనుసరించే సూత్రం ఒక్కటే! వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేసి, తొలి వారంలో వీలైనన్ని వసూళ్లు రాబట్టుకోవాలని చూస్తున్నారంతా!! రెండో వారానికి థియేటర్ల సంఖ్యను తగ్గిస్తున్నారు. థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు సంఖ్య కూడా తగ్గుతోంది. కానీ, ‘కనులు కనులను దోచాయంటే’ సినిమా మాత్రం ఈ పరిస్థితికి అతీతమని చెప్పాలి. రెండో వారంలో ఈ సినిమా థియేటర్లు పెరిగాయి.
 
దుల్కర్‌ సల్మాన్‌, రీతూ వర్మ జంటగా నటించిన రొమాంటిక్‌ థ్రిల్లర్‌ ‘కణ్ణుమ్‌ కణ్ణుమ్‌ కుళ్లయడిత్తా’. తెలుగులో ‘కనులు కనులను దోచాయంటే’గా విడుదలైంది. దేసింగ్‌ పెరియసామి దర్శకుడు. వయోకామ్‌ 18 స్టూడియోస్‌, ఆంటో జోసెఫ్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘కెఎఫ్‌సి ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ విడుదల చేసింది. ఫిబ్రవరి 28న విడుదలైన హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంతే కాదు, ప్రేక్షకుల డిమాండ్ మేరకు శనివారం నుండి 40 థియేటర్లను పెంచుతున్నట్టు నిర్మాతలు తెలిపారు. 
 
‘కెఎఫ్‌సి ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ నుండి కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ “సినిమాకు చక్కటి ఆదరణ లభిస్తోంది. ప్రేక్షకులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల డిమాండ్ మేరకు ఈ రోజు నుండి మేం 40 స్క్రీన్స్ యాడ్ చేశాం. అశేష ప్రేక్షకాదరణతో రెండో వారంలోనూ సినిమా థియేటర్లలో బలంగా నిలబడడమే కాదు, మంచి వసూళ్లను రాబడుతోంది” అని అన్నారు. 
 
ఇతర తారాగణం: రక్షణ్, నిరంజని అహతియాన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు
సాంకేతిక విభాగం:
డైరెక్టర్: దేసింగ్ పెరియసామి
ప్రొడ్యూసర్: వయాకామ్18 స్టూడియోస్ & ఆంటో జోసెఫ్ ఫిలిం కంపెనీ
సినిమాటోగ్రాఫర్ . కె.ఎం. భాస్కరన్
మ్యూజిక్: మసాలా కాఫీ
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: హర్షవర్ధన్ రామేశ్వర్
ఎడిటర్ : ప్రవీణ్ ఆంటోనీ
ఆర్ట్ : ఆర్.కె. ఉమాశంకర్
కాస్ట్యూమ్ డిజైనర్: నిరంజని అహతియాన్
స్టంట్: సుప్రీమ్ సుందర్
స్టిల్స్: ఎం.ఎస్. ఆనంద్
కోరియోగ్రఫీ: ఎం. షెరీఫ్