కబ్జా మూవీ 17 మార్చి 2023 న రిలీజ్

Published On: January 25, 2023   |   Posted By:

క‌బ్జా మూవీ  17 మార్చి 2023 న రిలీజ్‌

ఉపేంద్ర హీరోగా శ్రీ సిద్ధేశ్వర ఎంట‌ర్‌ప్రైజెస్ బ్యాన‌ర్ రూపొందిస్తోన్న ప్రెస్టీజియ‌స్ మ‌ల్టీలింగ్వుల్ మూవీ క‌బ్జా మార్చి 17న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్‌

క‌న్న‌డ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా న‌టిస్తోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ క‌బ్జా . శాండిల్‌వుడ్ నుంచి ఈ ఏడాది రిలీజ్ అవుతున్న ఈ చిత్రం కోసం అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా ప్రారంభం నుంచి ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ కంటెంట్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతూ వ‌చ్చింది. అందరి దృష్టిని ఆక‌ర్షిస్తోన్న ఈ భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని ఆర్‌.చంద్రు డైరెక్ట్ చేస్తున్నారు.

ఉపేంద్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుద‌లైన క‌బ్జా టీజ‌ర్‌తో ఈ పీరియాడిక్ ఫిల్మ్‌పై ఉన్న ఎక్స్‌పెక్టేష‌న్స్ నెక్ట్స్ లెవ‌ల్‌కు చేరుకున్నాయి. ఇండియాలో ఓ గ్యాంగ్‌స్ట‌ర్ క్ర‌మ క్ర‌మంగా ఎలా ఎదిగాడ‌నేదే క‌బ్జా చిత్రం. 1947 నుంచి 1984 కాలంలో న‌డిచే క‌థ‌. స్వాతంత్య్ర స‌మ‌ర యోధుడు కొడుకు మాఫియా వ‌రల్డ్‌లో ఎలా చిక్కుకున్నాడు. త‌ర్వాత ఏ రేంజ్‌కు చేరుకున్నాడ‌నే క‌థాంశంతో ఈ సినిమాను తెర‌కెక్కించారు.

చంద్రు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీని క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ జ‌యంతి సంద‌ర్భంగా మార్చి 17న వ‌ర‌ల్డ్ వైడ్‌ గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

క‌న్న‌డ చిత్రాలు కె.జి.య‌ఫ్‌, 777 చార్లి, విక్రాంత్ రోణ‌, కాంతార సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేష‌న్‌ను క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కోవ‌లోకి క‌బ్జా చిత్రం వ‌చ్చి చేర‌నుంది. ఇప్ప‌టికే ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. క‌న్న‌డ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ నుంచి మ‌రో పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌క్కా అని భావిస్తున్నారు.

కె.జి.య‌ఫ్ ఫేమ్ ర‌వి బ‌స్రూర్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ చిత్రంలో భారీ తారాగ‌ణం న‌టిస్తున్నారు. శ్రియా శ‌ర‌న్‌, కిచ్చా సుదీప్‌, శివ రాజ్‌కుమార్‌, జ‌గ‌ప‌తి బాబు, ప్ర‌కాష్ రాజ్‌, సముద్ర‌ఖ‌ని, ముర‌ళీ శ‌ర్మ‌, న‌వాబ్ షా, క‌బీర్ దుహాన్ సిఒంగ్‌, ద‌నీష్ అక‌ర్త ష‌ఫి, ప్ర‌దీప్ సింగ్ రావ‌త్‌, కృష్ణ ముర‌ళి పోసాని, ప్ర‌మోద్ శెట్టి, అనూప్ రెవ‌న‌న్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు.

ఎం.టి.బి నాగ‌రాజ్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ సిద్ధేశ్వ‌ర ఎంట‌ర్‌ప్రైజెస్ బ్యాన‌ర్‌పై ఆర్‌.చంద్రు ద‌ర్శ‌క‌త్వంలో ఈ భారీ బ‌డ్జెట్ మూవీ రూపొందుతోంది.