కలి సినిమా షూటింగ్ పూర్తి

Published On: March 9, 2024   |   Posted By:

కలి సినిమా షూటింగ్ పూర్తి

ప్రిన్స్, నరేష్ అగస్త్య హీరోలుగా నటిస్తున్న “కలి” సినిమా షూటింగ్ పూర్తి..

యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా కలి. ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇవాళ మహా శివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలతో స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉండి సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది…

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ ద్వితియార్ధం లో విడుదల చేయటానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. కలి పాత్ర చుట్టూ అల్లుకున్న ఈ కొత్త కథాంశం సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని మూవీ టీమ్ చెబుతున్నారు.

నటీనటులు – ప్రిన్స్, నరేష్ అగస్త్య, నేహా కృష్ణన్, గౌతంరాజు, గుండు సుదర్శన్, కేదార్ శంకర్, మని చందన, మధుమణి. తదితరులు.

టెక్నికల్ టీమ్:

సంగీతం – జీవన్ బాబు
ఎడిటర్ – విజయ్ కట్స్.
సినిమాటోగ్రఫీ – నిషాంత్ కటారి, రమణ జాగర్లమూడి.
పాటలు – సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి,
క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ – రాధాకృష్ణ తాతినేని, ధరణి కుమార్ టీఆర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఫణీంద్ర
పీఆర్వో – జీఎస్ కే మీడియా
సమర్పణ – కె. రాఘవేంద్ర రెడ్డి
నిర్మాత – లీలా గౌతమ్ వర్మ
రచన దర్శకత్వం – శివ శేషు