కళాపోషకులు చిత్రం సెన్సార్ పూర్తి
 
కళాపోషకులు టీమ్ ని అభినందించిన ఐటి శాఖ మినిష్టర్ కేటీఆర్ గారు
 
విశ్వకార్తికేయ, దీప ఉమావతి హీరో హీరోయిన్లుగా శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై  చలపతి  పువ్వల ద‌ర్శ‌క‌త్వంలో యం. సుధాకర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘కళాపోషకులు’. ఈ చిత్రం ట్రైలర్ కి ట్రెమండస్ రిపోన్స్ వస్తోంది.
 
కాగా ఈ చిత్రం టీమ్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారిని కలిసి విషెస్ తీసుకున్నారు. కళాపోషకులు సినిమా ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. హీరో విశ్వకార్తికేయ చాలా బాగా నటించాడు. ఫ్యూచర్ లో మంచి హీరోగా పేరు తెచ్చుకోవాలి.. డైరెక్టర్ చలపతి పువ్వుల సినిమాని బాగా తీశాడని తెలిసింది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.
 
సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం యు/ఎ సర్టిఫికెట్ సాధించింది. జనవరిలోనే ఈ చిత్రం రిలీజ్ కానుందని నిర్మాత సుధాకర్ రెడ్డి తెలిపారు.
 
విశ్వకార్తికేయ, దీప ఉమాపతి జంటగా నటించిన ఈ చిత్రంలో భాష, చైతన్య, చిన్ను, జ్వాల, జెమిని సురేష్, జబర్దస్త్ నవీన్, చిట్టిబాబు, తదితరులు నటించారు.
 
ఈ చిత్రానికి కెమెరామెన్: కళ్యాణ్ సమి, ఎడిటర్: సెల్వ కుమార్, సంగీతం: ఎలేందర్ మహావీర్,నిర్మాత, స్టొరీ: సుధాకర్ రెడ్డి.ఎం. స్క్రీన్ ప్లే-డైలాగ్స్- డైరెక్షన్: చలపతి పువ్వల.