కాదంబరికి కరోనా వారియర్ పురస్కారం

కరోన క్లిష్టకాలంలో చేసిన నిరూపమాన సేవలకుగాను.. ‘మనం సైతం’ కాదంబరిని ‘కరోనా వారియర్ పురస్కారం’ లభించింది. ‘విశ్వగురు వరల్డ్ రికార్డ్స్’ అనే సంస్థ ఈ పురస్కారాన్ని అందజేసింది.

ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో కొవిడ్ నిబంధనలకు లోబడి నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో ‘విశ్వగురు వరల్డ్ రికార్డ్స్’ మేనేజింగ్ డైరెక్టర్ సత్యవోలు రాంబాబు ఈ అవార్డును కాదంబరికి అందజేశారు.

తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్, ప్రముఖ నటులు-సినీ కార్మిక నాయకులు వినోద్ బాల ముఖ్య అతిధులుగా పాల్గొని, కాదంబరిని అభినందించారు. వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పొందిన ఈ పురస్కారం తనకు లభించడం తన బాధ్యతను మరింత పెంచిందని కాదంబరి పేర్కొన్నారు