కొత్త కొత్త‌గా చిత్రం సాంగ్ విడుద‌ల‌

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతీ విడుద‌ల‌చేసిన‌ `కొత్త కొత్త‌గా`చిత్రం నుంచి డైమండ్ రాణి సాంగ్ కు మంచి స్పంద‌న‌

అజయ్‌, వీర్తి వఘాని, హీరో హీరోయిన్లుగా, ఆనంద్ (సీనియర్ హీరో), తులసి, కాశీవిశ్వనాద్, కల్యాణి నటరాజన్ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్న చిత్రం `కొత్త కొత్త‌గా`.

బి జి గోవిందరాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మిస్తున్నారు యూత్ ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి హనుమాన్ వాసంశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఈ చిత్రంలోని  `డైమండ్ రాణి ..`సాంగ్ ను శుక్ర‌వారం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతీ ఆవిష్క‌రించారు. అనంత‌రం ఆయ‌న చిత్ర యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

శేఖర్ చంద్ర సంగీతం దర్శకత్వంలో కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి పాడిన `డైమండ్ రాణి ..`సాంగ్ ను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌ల చేసిన కొద్ది సేప‌టికే మంచి స్పంద‌న రావ‌డం విశేషం.

మంచి ప్రేమ‌క‌థా చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను ఇటీవ‌లే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి విడుద‌ల చేశారు. అలాగే టీజ‌ర్ కూడా మంచి ఆద‌ర‌ణ పొందుతోంది.

ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని, ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జరుగుతున్నాయి. ఈ సినిమాను త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

న‌టీన‌టులు-
అజయ్
వీర్తి వఘాని
ఆనంద్ (సీనియర్ హీరో)
కాశీ విశ్వనాధ్
తులసి
కల్యాణి నటరాజన్
పవన్ తేజ్
ఈరోజుల్లో సాయి త‌దిత‌రులు.

బ్యానర్: ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్
స‌మ‌ర్ప‌కులు: బి జి గోవింద రాజు
నిర్మాత: మురళీధర్ రెడ్డి ముక్కర
దర్శకుడు: హనుమాన్ వాసంశెట్టి
సంగీత దర్శకుడు: శేఖర్ చంద్ర
ఎడిటర్: ప్రవీణ్ పూడి
కెమెరా- వెంకట్
కొరియోగ్రాఫర్: హరికిరణ్
ఫైట్ మాస్టర్: పృధ్వీ శేఖర్
ఆర్ట్ డైరెక్టర్: సురేష్ భీమగాని
సాహిత్యం: కాసర్ల శ్యామ్, అనంత శ్రీరామ్, కృష్ణ చైతన్య, శ్రీ మణి.