కోటి స్వరపరిచిన సాంగ్ త్వరలో విడుదల
 
త్వరలో సేవ్ ది వరల్డ్ పేరుతో కోటి స్వరపరిచిన సాంగ్ విడుదల 
 
కరోనా దెబ్బ ఎంత తీవ్రంగా ఉందో తెలిసిందే. ఈ వైరస్ ధాటికి ప్రపంచం చిగురుటాకులా వణికిపోతోంది. దీంతో వైరస్ అరికట్టడానికి ప్రపంచమంతా ఇప్పుడు కృషి చేస్తుంది. అందులో భాగంగా ప్రభుత్వం తాను చేయాల్సిన ప్రయత్నాలు చేస్తోంది. కాగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ముందుకొచ్చింది, కరోనాను కట్టడి చేసే పనిలో భాగంగా సంగీత దర్శకుడు కోటి స్వరకల్పనలో చిరంజీవి, నాగార్జున, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఓ పాటలో కనపడుతూ ప్రజలకు అవగాహాన కల్పించే ప్రయత్నం చేశారు. ఈ పాటను చూసిన ప్రధాని మోదీ ప్రశంసించారు.
 
తాజాగా సంగీత దర్శకుడు కోటి మరో సోషల్ అవైర్నెస్ పాటతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సేవ్ ది వరల్డ్ పేరుతో రాబోతున్న ఈ పాట త్వరలో విడుదల కానుంది. అడవులు నరకడం, ప్లాస్టిక్ అధికంగా వాడడం, అధిక కాలుష్యం కలిగే అనర్థాల గురించి గ్లోబల్ వార్మింగ్   మీద ఈ పాట ఉండబోతొంది.