క‌రోనా నివార‌ణ కోసం ఎమ్ శ్రీ భరత్ విరాళం
 
క‌రోనా నివార‌ణ కోసం నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, గీతమ్ చైర్మన్ ఎమ్ శ్రీ భరత్ 1 కోటి రూపాయల విరాళం

కోవిడ్‌-19 వ్యాప్తి నిరోధం కోసం నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, గీతమ్ విద్యా సంస్థల చైర్మన్  ఎమ్ శ్రీ భరత్ 1 కోటి రూపాయల విరాళాన్ని ఇస్తున్నట్టు ప్రకటించారు. కరోనా వ్యాప్తి నిరోధానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి స‌హాయనిధికి రూ. 50 ల‌క్ష‌లు, తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి రూ. 25 ల‌క్ష‌లు, కర్ణాటక ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి రూ. 25 ల‌క్ష‌లు అంద‌జేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితిని స‌మ‌ష్టిగా ఎదుర్కోవాల‌నీ, ప్రజలు అంద‌రూ ఇళ్ల‌ల్లోనే సుర‌క్షితంగా ఉండాల‌నీ ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.