ఖైదీ మూవీ రివ్యూ

Image

స్క్రీన్ ప్లే అంటే ఇదీ …( ‘ఖైదీ’ రివ్యూ)

 
Rating:3/5

అతనో ఖైదీ…కానీ అప్పగించబడ్డ పని పోలీస్ లను సేఫ్ గా తీసుకుని వెళ్లటం..కానీ ఆ పని సవ్యంగా సాగనీయకుండా అడ్డుపడే డ్రగ్ బ్యాచ్. ఓ వీడియో గేమ్ కు సరపడ సరుకు ఇది. దీన్ని సినిమాగా ఉత్కంఠగా చూపెట్టడానికి సరపడ స్క్రీన్ ప్లే తో కూడిన సీక్వెన్స్ లు రాసుకుని, యాక్షన్ సీన్స్ దట్టించి వదిలితే ఎలా ఉంటుంది..ఖచ్చితంగా ఖైధీ సినిమాలాగ ఉంటుంది. కార్తీకు గతంలో వచ్చిన హిట్స్ తో వచ్చిన కీర్తి నామరూపాలు లేకుండా ఖర్చు అయ్యిపోతున్న సమయంలో వచ్చిన సినిమా ఇది. ఇంతకీ ఈ సినిమా కథేంటి, సినిమాలో మిగతా విశేషాలు ఏమిటి రివ్యూలో చూద్దాం.
 

స్టోరీ లైన్


స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ విజయ్(నరేన్) తన టీమ్ తో కలిసి ఎనిమిది వందల కోట్ల విలువైన కొకైన్ ని పట్టుకుంటాడు. దాన్ని తీసుకెళ్లి కమీషనర్ ఆఫీస్ లో సీక్రెట్ గా దాస్తాడు. అయితే డ్రగ్ మాఫియా మహా ముదురు. వాళ్లు ఓ ప్లాన్ వేస్తారు. రిటైర్ అవుతున్న  ఓ పోలీస్ ఆఫీసర్ ఇస్తున్న పార్టీలో ఇస్తున్న డ్రింక్ లో మత్తు మందు కలిపేసి స్పృహ తప్పిస్తారు. విజయ్ మీద ఎటాక్ చేస్తారు. అదే సమయంలో
 దిల్లీ (కార్తి)  పదేళ్లు జైలు శిక్ష అనుభవించి పెరోల్ పై బయిటకు వస్తాడు. ఆశ్రమంలో ఉన్న తన కుమార్తెను చూసేందుకు తరతహలాడుతూ వెల్తూంటాడు.  అయితే,అదే సమయంలో అతని రూపం చూసి పోలీస్ లు అనుమానించి ఆపుతారు. విషయం తెలుసుకుని అతనికో టాస్క్ ఇస్తారు. కాన్షస్ లో లేని పోలీస్ లను వంద కిలోమీటర్లు దూరంలో ఉన్న హాస్పటిల్ కు ఓ లారీలో తీసుకుని వెల్లమని కోరుతాడు. మొదట ఒప్పుకోకపోయినా తర్వాత తన కూతురుకు ప్లస్ అవుతుందని ఓకే అంటాడు. అక్కడ నుంచి  దిల్లీకి సమస్యలు ఎదురవుతాయి. డ్రగ్ మాఫియా ఓ రేంజిలో యాక్షన్ లోకి దిగుతుంది. అడుగడుక్కీ ఇబ్బందులు క్రియేట్ చేస్తుంది. వాటిన్నటినీ తప్పించుకుని డిల్లీ తన టాస్క్ నెరవేర్చాడా…అసలు దిల్లీ ఎవరు? ఎందుకు జైలుకు వెళ్లాడు?చివరకి దిల్లీ తన కూతురిని చూడగలిగాడా? లేదా? అన్నదే  కథ.

స్క్రీన్ ప్లే నే కథ

నిజానికి ఈ సినిమాలో చెప్పుకోవటానికి పెద్ద కథకాని, ట్విస్ట్ లు కానీ లేవు. కానీ కేవలం స్క్రీన్ ప్లేతో సినిమాని నిలబెట్టాడు దర్శకుడు. నాలుగు గంట‌ల వ్య‌వ‌ధిలో జ‌రిగే క‌థ ని… చాలా స్పీడుగా పరుగెత్తిస్తూ ,డిటైలింగ్ ఇస్తూ నడిపాడు దర్శకుడు.  అనుకోకుండా త‌న‌ది కాని స‌మ‌స్య‌లో ప‌డిపోయిన  హీరో, అందులోంచి బ‌య‌ట‌ప‌డడానికి ఎంత క‌ష్ట‌ప‌డాల్సివ‌చ్చింది, ఆ జర్నీలో ఎన్ని ఆటంకాలు ఎదుర్కోవాల్సివ‌చ్చింద‌న్న‌దే అనే దిశలోనే కథనం నడిపారు. మొదటి సీన్  నుంచే ఇంట్రస్ట్ రేకెత్తించ‌డంలో డైరక్టర్ స‌క్సెస్ అయ్యాడు. ఎనిమిది వంద‌ట కోట్ల విలువైన కొకైయిన్, అది బ‌ట్టుప‌డ‌డం, దాన్ని తిరిగి ద‌క్కించుకోవ‌డానికి  డ్రగ్స్  గ్యాంగ్ వేసే ఎత్తులు, ఎస్ పీ బంగ్లాలో జ‌రిగే పార్టీ,  హీరో ప‌రిచ‌యం….వరసగా జరిగిపోతూ సినిమాపై క్యూరియాసిటీ లెవిల్స్ ని పెంచుకుంటూ పోతూ ఓ చోట ఆగుతాయి. సెటప్ పూర్తైన దగ్గర నుంచీ హీరోకు ఓ టాస్క్ అప్పచెప్పి ఆ దిశగా మనచేత జర్నీ చేయిస్తాడు.

ఇక ఇక్కడితో ఆగకుండా దర్శకుడు కొన్ని ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ ని కథలో కూరుస్తాడు. గ్యాంగస్టర్ కు ఓ టెంపర్ మెంటల్ బ్రదర్, బోల్డ్ కానిస్టేబుల్, రిసోర్స్ ఫుల్ స్టూడెండ్స్, పోలీస్ లు, డ్రగ్స్ గ్యాంగ్ రెండింటిలోనూ స్పైలు, మరో ప్రక్క తండ్రి కోసం వెయిట్ చేస్తున్న కూతురు…ఇలా వీళ్లంతా కథని ప్రక్కదారి ప్రక్కకుండా నడిపిస్తారు.  

అయితే…

ఫస్టాఫ్ సెటప్ సీన్స్ తో పరుగెట్టినా…సెకండాఫ్ లో  బాగా స్లో అయ్యిపోయింది.  ఒకే తరహా సీన్స్ రిపీట్ అవుతూ సాగుతాయి. అలాగే సీన్స్ అన్నీ సహజత్వంగా ఉంటూ ఫైట్స్ మాత్రం రెగ్యులర్ కమర్షియల్ సినిమాలని గుర్తు చేస్తూంటాయి. ఈ లోపాలని కూడా హీరోయిన్ లేకపోవటం, పాటలు లేకపోవటం వంటివి కొత్త ఎక్సపీరియన్స్ ని ఇస్తూ దాచేస్తాయి.

టెక్నికల్ గా ..

ఈ సినిమాకు  దర్శకుడు లోకేష్ కనకరాజే హీరో అని చెప్పాలి. అతని షాక్ మేకింగ్ కానీ, నేరేటింగ్ స్క్రిల్స్ కానీ మనని ఆశ్చర్యపరుస్తాయి. అన్ని క్రాప్ట్ ల మీద అతని కంట్రోలు కూడా ముచ్చట కలిగిస్తుంది. అన్ని డిపార్టమెంట్స్ నుంచి సాధ్యమైనంత బెస్ట్ అవుట్ ఫుట్ తీసుకున్నాడు.  ఓ సాలీడ్ థ్రిల్లర్ కు ఉండాల్సిన లక్షణాలు అన్ని కలిగి ఉన్న ఈ సినిమాకు కెమెరా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ప్లస్ లు అయ్యాయి. ఎడిటింగ్ కూడా బాగుంది కానీ ఇంకాస్త షార్ప్ గా ఉంటే బాగుండేదనిపిస్తుంది. కాస్త లెంగ్త్ తగ్గితే  సినిమా ఇంకా బాగుండేది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ నీట్ గా ఉన్నాయి.

చూడచ్చా…

యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్లకు ఈ సినిమా బాగా నచ్చుతుంది.


తెర ముందు….వెనక

నటీనటులు: కార్తి, నరైన్‌, జార్జ్‌ మార్యన్‌, రమణ, వాట్సన్‌ చక్రవర్తి తదితరులు
సంగీతం: శామ్‌ సీ.ఎస్‌.
ఎడిటింగ్‌: ఫిలోమిన్‌ రాజ్‌
నిర్మాత: ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు
దర్శకత్వం: లోకేశ్‌ కనకరాజు
బ్యానర్‌: డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, వివేకానంద ఫిల్మ్స్‌
విడుదల తేదీ: 25-10-2019