గం..గం..గణేశా మూవీ తొలి రోజు బాక్సాఫీస్ వద్ద 1.82 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు

తొలి రోజు బాక్సాఫీస్ వద్ద 1.82 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు అందుకున్న గం..గం..గణేశా

అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ సక్సెస్ ఫుల్ బాక్సాఫీస్ జర్నీ స్టార్ట్ చేసింది ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గం..గం..గణేశా. నిన్న వరల్డ్ వైడ్ థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజు 1.82 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ దక్కించుకుంది. క్రైమ్ కామెడీ జానర్ లో తెరకెక్కిన గం..గం..గణేశా ఆడియెన్స్ కు హిలేరియస్ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తోంది. ఈ రోజు రేపు వీకెండ్ కాబట్టి బాక్సాఫీస్ నెంబర్స్ మరింతగా పెరగనున్నాయి.

గం..గం..గణేశాలో ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా కనిపించారు. ఈ సినిమాను హైలైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. గం..గం..గణేశా సినిమా హీరో ఆనంద్ దేవరకొండను సరికొత్తగా తెరపై ఆవిష్కరించింది. మంచి ఎనర్జిటిక్ క్యారెక్టర్ లో ఆనంద్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు.

నటీనటులు :

ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, కరిష్మా, వెన్నెల కిషోర్, సత్యం రాజేశ్, జబర్దస్త్ ఇమాన్యూయల్, రాజ్ అర్జున్, తదితరులు.

టెక్నికల్ టీమ్ :

ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాడి
సంగీతం చేతన్ భరద్వాజ్
బ్యానర్ హైలైఫ్ ఎంటర్ టైన్ మెంట్
నిర్మాతలు కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి
రచన, దర్శకత్వం ఉదయ్ శెట్టి