శ్రీ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ రక్తదానం
 
 
సుద్దాల అశోక్ తేజ గారి ఆపరేషన్ కు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి రక్త దాతలు
 
అక్షర శిల్పి,  ప్రసిద్ధ సినీ కవి,  జాతీయ స్థాయిలో తెలుగు పాటకు పట్టం కట్టిన సృజనశీలి, మరి ప్రత్యేకించి అత్యంత ఆత్మీయులైన శ్రీ సుద్దాల అశోక్ తేజ గారికి (మే 23, 2020) ఉదయం Liver Transplantation జరగబోతోంది.
 
హైదరాబాద్ గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రి లో జరగబోయే ఈ ఆపరేషన్లో భాగంగా అవసరమైన రక్తదానం చేసేందుకు చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు చెందిన 15 మంది రక్తదాతలు ఆ ఆసుపత్రిలో రక్తదానం చేశారు.
 
వేసవి వేడిమి,  కరోనా లాక్ డౌన్ లను సైతం పట్టించుకోకుండా ఈ మహత్తర కార్యానికి నడుం బిగించిన ప్రతి ఒక్క రక్తదాతకు మనఃపూర్వక ఆత్మీయతాభినందనలు తెలియజేసుకుంటున్నాము.
 
శ్రీ చిరంజీవి గారు ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలతమో… 
ఈ జన్మలో ఇంతమంది చేరువై…  పిలిచినది తడవుగా స్పందిస్తున్న మెగా బ్లడ్ బ్రదర్స్ అందరినీ, వారి కుటుంబాల్ని చల్లగా చూడాలని ఆ దేవదేవుణ్ణి  వేడుకుంటున్నాము.