చెక్ మేట్ సినిమా ట్రైలర్ రిలీజ్

నట కిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన చెక్ మేట్ ట్రైలర్ రిలీజ్

చిన్ని కృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై పై  ప్రసాద్  వెలంపల్లి దర్శక నిర్మాత గా తెరకెక్కించిన సినిమా చెక్ మేట్.. డాక్టర్ రాజేంద్రప్రసాద్, సందీప్, విష్ణుప్రియ,  దీక్షపంత్, బ్రహ్మనందం, రఘుబాబు షకలక శంకర్ కీలక పాత్రల్లో నటించారు.ఈ సినిమా ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా దర్శకులు వివి.వినాయక్ మాట్లాడుతూ: సినిమా ట్రైలర్ చాలా బాగుంది .నేటి యువత అభిరుచులకు అద్దం పడుతూ అందరికీ కనెక్ట్ అయ్యే అంశాలతో సినిమా వుంటుందని ట్రైలర్ ద్వారా తెలుస్తుంది.

రాజేంద్రప్రసాద్,బ్రహ్మానందం,రఘుబాబు,కృష్ణ భగవాన్ వంటి సీనియర్స్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్. దర్శకుడు ప్రసాద్ నాకు మంచి మిత్రుడు.అతను చేసిన ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను 

దర్శక నిర్మాత ప్రసాద్ వెలం పల్లి మాట్లాడుతూ: నేటి సమాజంలో యూత్ ముఖ్యంగా లేడీస్ వాళ్లకు ఏదైనా సమస్య వస్తె డైర్యంగా ఆసమస్య ను పరి ష్కరించు కొలేక ఆ సమస్యను ఎవరికి చెప్పుకోలేక అత్మ హత్యలు చేసుకుంటున్నారు. అలా కాకుండా సమస్యను దైర్యం గా పరిష్కరించుకోవాలి అనే పాయింట్ తో నలుగురు వ్యక్తులు వాళ్లకు వచ్చిన సమస్యలను వాళ్ళు ఎలా దైర్యం గా ఎదుర్కొన్నారు అనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించాము. రాజేంద్ర ప్రసాద్ గారు,బ్రహ్మానందం గారు రఘుబాబు మిగతా అందరూ నటీనటులు, టెక్నీషియన్స్ మాకు పూర్తిగా సపోర్ట్ చేశారు .సినిమా అందరికీ నచ్చే విధంగా భారీ స్టార్ కాస్ట్ తో,మలేషియా సింగపూర్ లోని బ్యూటిఫుల్ లోకేషన్స్ లో తెరకెక్కించాం. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి.త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం ట్రైలర్ రిలీజ్ చేసి మా చిత్రాన్ని తన సినిమాగా మాకు అన్ని విధాలా సపోర్ట్ చేస్తున్న వినాయక్ గారికి ధన్యవాదముు లు అని అన్నారు.

డాక్టర్ రాజేంద్రప్రసాద్,సందీప్,విష్ణుప్రియ, దీక్ష పంత్, బ్రహ్మానందం,, రఘుబాబు సంపూర్ణేష్ బాబు, షకలక శంకర్, పూర్ణిమ,కృష్ణ భగవాన్,ఆర్కే మల్లిడి, సుడిగాలి సుధీర్,అదుర్స్ రఘు, తాగుబోతు రమేష్,సత్యకృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: గరుడ వేగ అంజి, మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్: మహతి, ఎడిటర్: క్రాంతి, లిరిసిస్ట్: రెహమాన్, కో ప్రొడ్యూసర్: కే.కామేశ్వర్, నిర్మాత, దర్శకత్వం: ప్రసాద్ వెలంపల్లి.